మయోనైజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. 

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి ఇప్పుడు మన ఆరోగ్యంపైనా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న పనిభారం మన ఆహారపు అలవాట్లపై కూడా ఆయా ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి బానిసలుగా మారడానికి ఇదే కారణం. గత కొంత కాలంగా మయోనైజ్ వాడే ట్రెండ్ ప్రజల్లో బాగా పెరిగిపోయింది. కానీ అది తింటే ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది.


ప్రస్తుత తరంలో ఫాస్ట్ ఫుడ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీని అధిక వినియోగం మన ఆరోగ్యానికి ప్రమాదకరం. అంతేకాదు చాలా అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. చాలా మంది మోమోలు, శాండ్‌విచ్‌లు తినడానికి ఇష్టపడుతున్నారు. తరచుగా వాటి రుచిని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వాటిపై వేసే చట్నీ , ముఖ్యంగా మయోనైజ్ మన ఆరోగ్యానికి చాలా విధాలుగా హాని కలిగిస్తుందని మీకు తెలుసా..? మీరు కూడా మయోన్నైజ్ కలిపిన మోమోస్, శాండ్‌విచ్‌లు, బర్గర్‌లనుతింటున్నారా..? 

 

 ఇది కూడా చదవండి..ఎలాంటి వాళ్ళు వేరుశెనగలు తినకూడదు..? 

ఇది కూడా చదవండి..మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ ఐదు ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైరస్‌ల గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..యునాని వైద్యానికి అల్లోపతికి లింక్ ఉందా..? 

ఇది కూడా చదవండి..పులియబెట్టిన ఆహారాలు తినడం ద్వారా (గట్ హెల్త్ )పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చా..?

 

మయోన్నైజ్ తో బరువు.. 

మయోనైజ్ రుచి మీ నాలుకకు చాలా రుచికరంగా అనిపించినప్పటికీ, అది మీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. దీన్ని తినడం వల్ల ఊబకాయం బారిన పడవచ్చు. మయోనైజ్ లో బరువు పెరగడానికి దోహదం చేసే కారకాలు ఉన్నాయి. మీరు దీన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, అందులో ఉండే కేలరీలు మీ బరువును వేగంగా పెంచడం ప్రారంభిస్తాయి. తద్వారా శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పేరుకుపోతుంది. 

 
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం..  

 డయాబెటిక్ పేషెంట్ అయితే మయోజ కు దూరంగా ఉండటం మంచిది. మయోన్నైజ్ అధిక వినియోగం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి దోహదం చేస్తుంది. ఇది మీ ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మయోన్నైజ్ తినాలనుకుంటే, దానిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవడం చాలా ముఖ్యం.

గుండెకు మంచిది కాదు.. 

మయోనైజ్ ఎక్కువగా తినడం గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. ఇందులో ఉండే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు అధిక రక్తపోటుకు కారణమవుతాయి. ఇది స్ట్రోక్ , గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది, కాబట్టి దీనిని వీలైనంత వరకూ తీసుకోకపోవడమే మేలు. 

 

ఇది కూడా చదవండి..బీ అలెర్ట్ : కాలేయ వ్యాధులకు ఇవే ప్రధాన కారణాలు.. ?

ఇది కూడా చదవండి..డబ్ల్యూహెచ్‌ఓ న్యూ రిపోర్ట్ : టీబీకి ఈ ఐదు ప్రధాన కారణాలే.. 

ఇది కూడా చదవండి..కాలేయ వ్యాధి ఉంటే పాదాలపై ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : mayonnaise-banned-in-telangana egg-mayonnaise-banned ghmc-banned-egg-mayonnaise mayonnaise side-effects-of-mayonnaise mayonnaise-recipe 7-ugly-side-effects-of-mayonnaise-to-be-wary-of mayonnaise-side-effects how-to-make-mayonnaise is-mayonnaise-healthy mayonnaise-harmful-effects recipe-of-mayonnaise

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com