సాక్షి లైఫ్ : 2025 నాటికి క్షయవ్యాధిని (టిబి) అంతం చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రపంచదేశాలతో పోలిస్తే 26 శాతం టీబీ కేసులు మన దేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రచురించిన నివేదిక వెల్లడించింది. గ్లోబల్ ట్యూబర్‌క్యులోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారం.. టీబీ అధికంగా ఉన్న దేశాల గణాంకాలతో పోలిస్తే భారతదేశంలోనే ఈ కేసులు (26శాతం) ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఇండోనేషియా (10 శాతం), చైనా (6.8 శాతం), ఫిలిప్పీన్స్ (6.8 శాతం) ,పాకిస్తాన్ (6.3 శాతం) ప్రపంచ టీబీ కేసుల్లో 56 శాతం ఈ దేశాల్లోనే నమోదవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా టీబీ మళ్లీ 2023లో కోవిడ్-19ని అధిగమించింది. 2023లో సుమారు 8.2 మిలియన్ల మందికి కొత్తగా టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. డబ్ల్యూహెచ్‌ఓ1995లో ప్రపంచ క్షయ పర్యవేక్షణను ప్రారంభించినప్పటి నుంచి ఈ కేసులు అత్యధిక సంఖ్యలో నమోదు అయ్యాయి. 2022లోని క్షయ నివేదిక 7.5 మిలియన్లపైగా పెరిగింది. ఈ క్షయ వ్యాధి పురుషులలో (55 శాతం) సర్వసాధారణంగా ఉన్నట్లు కనుగొన్నారు. మహిళలు 30 శాతానికి పైగా ఉండగా, 12 శాతం మంది పిల్లలు ,యువకులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..కంటి చూపు విషయంలో ఏమేం చేయకూడదు..?
ఇది కూడా చదవండి..రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య స్త్రీలకే ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..తెలంగాణలో మయోనైజ్ నిషేధం.. కారణం ఇదే..
"టిబి ఇప్పటికీ చాలా మందిని చంపుతుంది, తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తోంది. దానిని నివారించడానికి, గుర్తించడానికి, చికిత్స చేయడానికి అనేక సాధనాలు ఉన్నప్పుడు కూడా ఇలా జరగడం సరికాదని, దీనిని నిర్మూలించడానికి మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.
ఈ ఐదు కారణాలే..
"ఆయా సాధనాల వినియోగాన్ని విస్తరించడానికి, టిబిని అంతం చేయడానికి అందరూ ముందుకురావాలని" ఆయన అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా కొత్త క్షయ కేసులు నమోదు కావడానికి ప్రధానంగా ఐదు కారణాలున్నాయి. వీటిలో పోషకాహార లోపం, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఆల్కహాల్, ధూమపానం (ముఖ్యంగా పురుషులలో)మధుమేహం ఉన్నాయి. కొత్త TB కేసుల అంచనా సంఖ్య నివేదించిన వాటి మధ్య అంతరం తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ఇది 2020, 2021లో కోవిడ్ మహమ్మారి స్థాయిల 4 మిలియన్ల నుండి 2.7 మిలియన్లకు తగ్గింది.
HIVతో జీవిస్తున్న వ్యక్తులకు టీబీ నివారణ చికిత్స అందించినప్పటికీ, మల్టీడ్రగ్-రెసిస్టెంట్ టీబీ అనేది ప్రజారోగ్య సంక్షోభంగా మిగిలిపోయింది. మల్టీడ్రగ్ రెసిస్టెంట్ లేదా రిఫాంపిసిన్-రెసిస్టెంట్ TB (MDR/RR-TB) చికిత్స విజయవంతమైన రేట్లు ఇప్పుడు 68 శాతానికి చేరుకున్నాయని కానీ, MDR/RR-TBని అభివృద్ధి చేసినట్లు అంచనా వేసిన 4లక్షల మందిలో 44 శాతం మంది మాత్రమే 2023లో రోగనిర్ధారణ అనంతరం చికిత్స పొందారని నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com