Weak Bones in Children : చిన్నారుల్లో బలహీన పడుతున్న ఎముకలు.. కారణాలు ఏంటంటే..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లే శాపంగా మారుతు న్నాయి. పిల్లల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరూ ఎముకల బలహీనతతో సతమతమవుతున్నారు. సరైన పోషణ, సూర్యరశ్మి లేకపోవడంతో బోన్స్ మరింతగా వీక్ అవుతాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. మారిన కాలంతో పాటు పిల్లల అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు అంటే ఆమడదూరం పరుగెడుతున్నారు. ఫలితంగా 5 నుంచి 12 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో కాల్షియం లోపం తలెత్తి ఎముకలు మరింతగా బలహీన పడుతున్నాయి. దీనికి తోడు ఎండ తగలకపోవడంతో విటమిన్ డి లోపం కూడా తోడవుతోంది.

 

ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..Ajna Chakra : ఆజ్ఞా చక్రం శక్తిని పెంచడానికి ఏ యోగా సాధనలు చేయాలి..?

 

గణాంకాలు ఏమి చెబుతున్నాయి..? 
 
సుమారు 20 శాతం మంది చిన్నారులు ఈ తరహా సమస్యలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 3 శాతం మంది పిల్లలకు ఎముకలు వంకర పోవడం (Rickets) వల్ల ఎత్తు పెరగడం ఆగిపోతోంది. 

ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి..

స్వల్ప గాయాలకే ఎముకలు విరగడం.

కాళ్ల కండరాల్లో నొప్పి, వాపు.

మెడ, వెన్నుముక భాగాల్లో తరచుగా నొప్పి రావడం.

కాళ్లు వంకరగా మారి నడకలో ఇబ్బందులు తలెత్తడం.

ఎక్కువ సేపు నిలబడలేకపోవడం.

యువతలోనూ 'బోలు' ఎముకలు..  

కేవలం పిల్లలే కాదు, 18 నుంచి 20 శాతం మంది యువత కూడా ఎముకల బలహీనతను ఎదుర్కొంటున్నారని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ అనుభవ్ శర్మ హెచ్చరిస్తున్నారు. వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం వల్ల ఎముకలు లోపల గుల్లబారిపోతున్నాయి. దీంతో చిన్నపాటి దెబ్బలకే తుంటి ఎముకలు విరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. పడుకుని మొబైల్ చూడటం, గంటల తరబడి టీవీలకు అతుక్కుపోవడం వల్ల మెడ, వెన్ను సమస్యలు తీవ్రమవుతున్నాయి. 60 ఏళ్లు దాటిన తర్వాత తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు అవసరమయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. 55 ఏళ్లలోపు వారు జీవనశైలి మార్చుకుంటేనే ఈ ముప్పు నుంచి తప్పించుకోగలరు.

నివారణ మార్గాలు..? 

ఎండలో ఆటలు: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య కనీసం కొంత సమయమైనా సూర్యరశ్మి తగిలేలా చూడాలి. రోజుకు 2-3 గంటల పాటు ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి. స్వచ్ఛమైన పాలు, ఇతర పాల ఉత్పత్తులు తప్పనిసరిగా తీసుకోవాలి. పప్పుధాన్యాలు, ఆకుకూరలు, తాజా పండ్లు, సలాడ్లను రోజువారీ మెనూలో చేర్చుకోవాలి.  

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్.. 

ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుందా..??

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.