జింక్ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారాలు అవసరం..?
సాక్షి లైఫ్ : చిక్కుళ్ళు జింక్‌కి మంచి మూలం. అంతేకాదు శనగలు, తెల్ల శనగలు, బీన్స్ వంటి పప్పులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జింక్ లోపాన్ని అధిగమించవచ్చు. నట్స్ లో జింక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జింక్ లోపం ఉన్నవారు బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ మొదలైన వాటిని తినడం మంచిది. డార్క్ చాక్లెట్‌లో కూడా అధిక స్థాయిలో జింక్ ఉంటుంది. అంతేకాదు యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ , మెగ్నీషియం వంటివాటికి ఇది అద్భుతమైన మూలం. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడమేకాకుండా రక్తపోటును కూడా తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
జింక్ శరీరానికి అవసరమైన ఖనిజం. శరీర రోగనిరోధక వ్యవస్థ, జీర్ణక్రియ, నరాల పనితీరు, శారీరక పెరుగుదలను నిర్వహించ డానికి జింక్ ఎంతో అవసరం. జింక్ జీవక్రియ రేటును పెంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే జింక్ ఎక్కువగా లభించే ఆహారాలు ఏవి..? ఎలాంటివి తినడం ద్వారా జింక్ లోపాన్ని అధిగమించవచ్చు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఓట్స్..
ఓట్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని అణచివేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. చికెన్‌లో కూడా జింక్ ఉంటుంది. చికెన్ సూప్, గ్రిల్డ్ చికెన్ తీసుకోవడం ద్వారా జింక్ లోపం నుంచి బయటపడొచ్చు.
జింక్ లోపం ఉంటే..?
జింక్ పండ్లు, కూరగాయలలో పుష్కలంగా ఉంటుంది. అవోకాడో, జామ, దానిమ్మ, బచ్చలికూర ,బ్రోకలీలో ఎక్కువగా జింక్ ఉంటుంది. పాలు, చీజ్, పెరుగుతో సహా పాల ఉత్పత్తుల్లో కూడా జింక్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా హెల్తీ గా ఉండొచ్చు. గుడ్లు పోషకాల భాండాగారం. గుడ్లలో విటమిన్లు ఏ, బి, సి, ఇ ,కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఒక పెద్ద గుడ్డులో ఐదు శాతం జింక్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..ఆక్యుపంక్చర్ చికిత్సలో మందులు లేకుండా మధుమేహం నయం అవుతుందా..?
ఇది కూడా చదవండి..చేతి పరిశుభ్రత వల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే ప్రాముఖ్యత..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
