మీకు ఉప్పు ఎక్కువగా తినే అలవాటు ఉందా..? ఇది మీకోసమే..  

షేర్ చేయండి:
మీకు ఉప్పు ఎక్కువగా తినే అలవాటు ఉందా..? ఇది మీకోసమే..  

సాక్షి లైఫ్ : ఉప్పు ఆహారం, కూరల రుచి పెరగడమే కాకుండా శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది. అది ఎప్పుడు అంటే..? పరిమిత పరిమాణంలో తీసుకుంటే..? కానీ ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. అవును, మీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ)సూచించిన మొత్తం కంటే ఎక్కువ ఉప్పు  తీసుకుంటున్నట్లైతే, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు అధికంగా తీసుకోడం వల్ల ఎలాంటి హాని జరుగుతుందో తెలుసుకుందాం.

 ఉప్పు ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఉప్పును సరైన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది, ఇది నీటి సమతుల్యతను కాపాడుకోవడంలో, జీర్ణక్రియకు సహాయం చేయడంతోపాటు, రక్తపోటును నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

 

ఇది కూడా చదవండి..రెటినాయిడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

 

అయినప్పటికీ, ఏదైనా అధిక మోతాదు హానికరం. అటువంటి పరిస్థితిలో, అధిక ఉప్పు వినియోగం అధిక రక్తపోటు, గుండె జబ్బులు,మూత్రపిండాల సమస్యలు వంటి అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. చిప్స్, నూడుల్స్ ,అల్ట్రా-ప్రాసెస్డ్ నాన్ వెజ్ ఫుడ్స్ వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తరచుగా అధిక మొత్తంలో ఉప్పును కలిగి ఉంటాయి. కాబట్టి ఇలాంటివి తీసుకోకపోవడమే ఉత్తమం అని డాక్టర్లు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి..గర్భం దాల్చిన మొదటి మూడునెలలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎందుకు వస్తుందో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఏ వయసువారిలో రక్తహీనత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి..? 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.