డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. ఈ సమస్యను నియంత్రించకపోతే ఆరోగ్యానికి చాలా ప్రమాద కరంగా మారుతుంది. అటువంటి తీవ్రమైన సమస్య డయాబెటిక్ న్యూరోపతి. ఈ సమస్య ఉన్నవారిలో నరాలు దెబ్బతింటాయి. డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు ఎలా ఉంటాయి..? ఇలాంటివారికి ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..?
ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?
డయాబెటిక్ న్యూరోపతి..
షుగర్ ఉన్నవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. డయాబెటిక్ న్యూరోపతి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు.నరాలు మన శరీరంలోని వివిధ భాగాలకు రక్తప్రసరణ చేస్తాయి. ఈ నరాలు దెబ్బతిన్నప్పుడు, రక్త ప్రసరణ ప్రక్రియ సజావుగా సాగదు. అటువంటి పరిస్థితిలో, పాదాలలో నొప్పి, జలదరింపు లేదా తిమ్మిరి వంటి అనుభూతి కలుగుతుంది.
చక్కెర పరిమాణం..
మధుమేహం విషయంలో, శరీరంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. దీన్ని సరిగ్గా నియంత్రించకపోతే నరాలు దెబ్బతింటాయి. దీనినే "డయాబెటిక్ న్యూరోపతి" అంటారు. నరాల దెబ్బతినడం (డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు) కారణంగా, శరీర భాగాలు సరిగ్గా పనిచేయవు. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. అందువల్ల, మధుమేహాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి, ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి, అందుకోసం డాక్టర్ సలహాలను పాటించాలి.
ఇది కూడా చదవండి..ఏ వైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి..ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు..
ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
