హెమటోలాజికల్ క్యాన్సర్ అంటే ఏమిటి..? లక్షణాలను ఎలా గుర్తించాలి..?

షేర్ చేయండి:
హెమటోలాజికల్ క్యాన్సర్ అంటే ఏమిటి..? లక్షణాలను ఎలా గుర్తించాలి..?

సాక్షి లైఫ్ : హెమటోలాజికల్ క్యాన్సర్ అనేది రక్తం, రక్త నిర్మాణం, వాటి సంబంధిత అవయవాలైన ఎముక మజ్జ, లింఫా నోడ్స్,హేమటోపోయెటిక్ వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్‌ను సూచిస్తుంది. ఈ రకమైన క్యాన్సర్‌లో ముఖ్యంగా లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి వ్యాధులు ఉంటాయి. ఇవి రక్త కణాలను, లింఫా టిష్యూలను లేదా ఎముక మజ్జను ప్రభావితం చేస్తాయి.

బ్లడ్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీనిని హెమటోలాజికల్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఈ వ్యాధి (బ్లడ్ క్యాన్సర్) ప్రాణాంతకం అయినప్పటికీ, ప్రారంభదశలో ఆయా వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే, సరైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 

 బ్లడ్ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఆయా  సంకేతాలను గురించి తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..  
 

ఇది కూడా చదవండి..శీతాకాలంలో పాల కూర ఎక్కువగా తింటున్నారా..? 

ఇది కూడా చదవండి..పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకు తెలుసా..?

ఇది కూడా చదవండి..స్త్రీలలో క్యాల్షియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఏమిటి..?

 

అలసట..  

చాలా అలసటగా అనిపించడంతోపాటు, మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ల బారిన పడినట్లయితే, అది బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో ఒకటి కావచ్చు. ఎందుకంటే క్యాన్సర్ ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది రక్తహీనతకు కారణమవుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కూడా బ్లడ్ క్యాన్సర్ సంకేతమేనని వైద్య నిపుణులు అంటున్నారు. 
 
బరువు తగ్గడం.. 

 అకస్మాత్తుగా బరువు కోల్పోతే, అది బ్లడ్  క్యాన్సర్ మాత్రమే కాదు. ఇతర రకాల క్యాన్సర్ల ప్రారంభ లక్షణాలు కావచ్చు. వ్యాధితో పోరాడటానికి శరీరం శక్తిని ఖర్చు చేసినప్పుడే ఇది జరుగుతుంది. ఇది కాకుండా, కణుపులలో వాపు, ముఖ్యంగా మెడ, నడుము, లింఫోమా లక్షణం కావచ్చు, ఇది రక్త క్యాన్సర్ హెచ్చరిక సంకేతంగా పరిగణిస్తారు. 
 
 రక్తస్రావం.. 

ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం వల్ల చిన్న గాయాలు అయినా ఎక్కువసేపు  రక్తస్రావం అవుతుంది. ఇది కొన్ని రకాల బ్లడ్  క్యాన్సర్‌లకు కూడా వర్తిస్తుంది. బ్లడ్ క్యాన్సర్ ఎముక మజ్జను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఎముకలలో నొప్పి లేదా పగుళ్లకు కారణం అవుతుంది. 
 
జ్వరం.. 

ఎటువంటి కారణం లేకుండా జ్వరంతోపాటు, తరచుగా రాత్రిపూట చెమటలు పట్టడం అనేది బ్లడ్ క్యాన్సర్ కు సంకేతం. వీటితోపాటు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల, మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.  

 

ఇది కూడా చదవండి..ఇతర మందులతో పాటు హోమియోపతి మందులు వాడొచ్చా..?

ఇది కూడా చదవండి..2025 న్యూ ఇయర్ లో హెల్తీగా,ఫిట్‌గా ఉండటానికి డబ్ల్యూ హెచ్ఓ 5 ముఖ్యమైన సూచనలు.. 

ఇది కూడా చదవండి..హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలాంటి మహిళలకు అవసరం..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.