అధిక బరువును తగ్గించే టీ..

సాక్షి లైఫ్ : పెరుగుతున్న బరువును నియంత్రించడంలో కొన్నిరకాల టీ సమర్థవంతమైన పనితీరు కనబరుస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు అపరాజిత పువ్వులతో చేసిన టీని ప్రతి రోజూ ఉదయం తాగడం ఉత్తమం. ఈ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరిగిపోతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తపోటును నియంత్రించడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయి. బ్లూ టీ తాగడం వల్ల కలిగే లాభాలు, దానిని తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లడ్ ప్రజర్.. 

అపరాజిత పుష్పాలతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

బెల్లం టీ, అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ ఇలా ఒకటేమిటి..? టీ లో అనేకరకాలున్నాయి. వీటిల్లో బ్లూ "టీ" కూడా ఒకటి. అపరాజిత టీని బ్లూ టీ అంటారు. అపరాజిత పువ్వును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ అపరాజిత పువ్వులో ఉన్నాయి. ఈ పువ్వును శంఖు పువ్వు, బటర్ ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు. 

ఇది కూడా చదవండి..మహిళలు ఎన్నాళ్లకు ఓసారి పూర్తి శారీరక పరీక్ష చేయించుకోవాలి..?

ఇది కూడా చదవండి..వింటర్ లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఏడు ఆహారాలు..

ఇది కూడా చదవండి..మయోనైజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. 

ఇది కూడా చదవండి..బీ అలెర్ట్ : కాలేయ వ్యాధులకు ఇవే ప్రధాన కారణాలు.. ?

ఇది కూడా చదవండి..డబ్ల్యూహెచ్‌ఓ న్యూ రిపోర్ట్ : టీబీకి ఈ ఐదు ప్రధాన కారణాలే.. 

ఇది కూడా చదవండి..కాలేయ వ్యాధి ఉంటే పాదాలపై ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?

 

ఇమ్మ్యూనిటీ పవర్.. 

బ్లూ టీ తీసుకోవడం వల్ల మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ టీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

 అధిక బరువు..  

పెరుగుతున్న బరువును నియంత్రించడంలో ఈ టీ సమర్థవంతమైన పనితీరు కనబరుస్తుంది. కాబట్టి బరువు తగ్గాలంటే అపరాజిత పువ్వులతో చేసిన టీని ప్రతి రోజూ ఉదయం తాగాలి. ఈ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరిగిపోతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

షుగర్ లెవల్స్..  

అపరాజిత పువ్వుతో తయారుచేసిన "టీ" మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ టీలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి, దీని కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. 

బ్లూ టీ తీసుకోవడం ద్వారా వృద్ధాప్య సమస్యను అధిగమించవచ్చు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ముఖంపై ఉండే ముడతలతోపాటు, వృద్ధాప్య లక్షణాలు తొలగి పోవడమే కాకుండా యవ్వనంగా కనిపిస్తారు.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి వాళ్ళు వేరుశెనగలు తినకూడదు..? 

ఇది కూడా చదవండి..మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ ఐదు ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైరస్‌ల గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..యునాని వైద్యానికి అల్లోపతికి లింక్ ఉందా..? 

ఇది కూడా చదవండి..పులియబెట్టిన ఆహారాలు తినడం ద్వారా (గట్ హెల్త్ )పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చా..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : weight-loss weight-lose weight blue-tea over-weight blue-tea-benefits blue-tea-recipe how-to-make-blue-tea blue-pea-tea blue-herbal-tea blue-tea-india blue-tea-for-weight-loss blue-ternate-tea blue-flower-tea blue-pea-flower-tea drink-blue-tea what-is-blue-tea blue-tea-health-benefits

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com