వింటర్ లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఏడు ఆహారాలు.. 

సాక్షి లైఫ్ : దేశంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రంగా మొదలైంది.  ఉష్ణోగ్రతలు తగ్గడంతో నెమ్మదిగా చలి పెరుగుతోంది. శీతాకాలం ఇక ప్రారంభమైనట్లే. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో వచ్చిన మార్పులతో మన జీవనశైలి కూడా మారుతోంది. శీతాకాలంలో వెచ్చగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈ కాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


శీతాకాలంలో చలి నుంచి రక్షించుకోవడానికి వెచ్చని బట్టలు, ఆరోగ్యక రమైన ఆహారం తప్పనిసరి. ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా మారుతుంది. దీని కారణంగా జలుబు, ఫ్లూ బారిన పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మారుతున్న వాతావరణంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.

 
 సుగంధ ద్రవ్యాలు..  

భారతీయ వంటగదిలో చాలా సుగంధ ద్రవ్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ మసాలాలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి.  కాబట్టి శీతాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీరు మీ ఆహారంలో అల్లం, పసుపు ,దాల్చినచెక్కను చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి.

 

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గింజలు-విత్తనాలు..  

అనేక పోషకాలతో కూడిన గింజలు, విత్తనాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి మీరు మీ ఆహారంలో బాదం, వాల్‌నట్, అవిసె గింజలు మొదలైన వాటిని చేర్చుకోవచ్చు. ఇవి అద్భుతమైన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలాలు.

ఆకు కూరలు.. 
 
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్లు , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, కాబట్టి అవి శీతాకాలంలో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాదు ఆకుకూరల్లో ఉండే అనేక పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

సూప్.. 

శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే, చలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం, వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, శీతాకాలంలో వెచ్చగా ఉండటానికి, మీరు టమోటాలు, కూరగాయలతో చేసిన పోషకాలు అధికంగా ఉండే సూప్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఇది మీకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించడంలో సహాయపడుతుంది.

సిట్రస్ ఫ్రూట్స్.. 

నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి మీ ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లను చేర్చుకోవాలి.

 

ఇది కూడా చదవండి..కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?

ఇది కూడా చదవండి..యుక్తవయసులో ఎలాంటి శారీరక లక్షణాలు డిప్రెషన్ ను సూచిస్తాయి..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : winter-season winter-skin how-to-take-care-of-skin-in-winter dry-skin-in-winter tips-for-very-dry-skin-in-winter beauty-tips-in-winter-for-dry-skin dry-skin-in-the-winter winter-skin-care-tips winter-foods winter-must-have-foods winter-foods-to-eat winter-foods-to-keep-you-warm healthy-winter-foods-to-eat what-to-eat-in-winter foods-to-eat-in-winter winter-food what-to-eat-in-winter-season winter foods-you-should-eat-in-winter top-indian-winter-foods foods-for-winter superfoods-to-eat-in-winter winter-foods-for-good-health fruits-to-eat-during-winter 10-best-foods-for-healthy-skin-in-winter what-to-eat-during-winter best-foods-for-winter

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com