సాక్షి లైఫ్ : భారత దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రెయిన్ సీజన్ ఉంటుంది. ఈ సీజన్ అంటే చిన్న పిల్లలకు ఎంతో ఇష్టం. వర్షాలు పడే సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ సీజన్ పలురకాల ఫ్లూ వైరసులను కూడా తీసుకువస్తుంది. చల్లని వాతావరణం ఫ్లూ వైరసులకు అనుకూలంగా ఉంటుంది.
ఐదు సంవత్సరాల లోపు పిల్లలలోనూ, వృద్ధులలోనూ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ సీజన్ లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ వంశీధర్ కేదార్ చెబుతున్నారు. అయితే ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అవసరమైన చిట్కాలు ఆయన తెలిపారు.. అవేంటంటే..?
ఇది కూడా చదవండి.. జంక్ ఫుడ్ అధిక వినియోగం వల్ల మధుమేహం..?
ఇది కూడా చదవండి.. వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి.. పెరుగుతున్న చాందీపురా వైరస్ కేసులు..
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి..
ఫ్లూ వ్యాక్సినేషన్..
1. ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా అవసరం. ఇది అన్ని రకాల వైరస్‌లను అడ్డుకుంటుంది. ఫ్లూ వైరసులు ప్రతి సంవత్సరం మారుతాయి, గతంలో మీరు తీసుకున్న వ్యాక్సినేషన్ వ్యాధిని అడ్డుకోలేకపోవచ్చు. అంతేగాక, ప్రతి సంవత్సరం కొత్త వైరస్ రూపాలను పరిశీలించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సినేషన్ మార్పులను సూచిస్తుంది. అందువల్ల, ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా ఆయా వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.
2. విటమిన్ "డి" ..
విటమిన్ "డి" లోపం రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను పెంచుతుంది. వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీని వల్ల విటమిన్ "డి" ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి డాక్టర్ ను సంప్రదించి విటమిన్ D సప్లిమెంట్స్ అవసరమో లేదో తెలుసుకుని విటమిన్ "డి" లోపాన్ని అధిగమించాలి.
3. వ్యాయామం..
వర్షం కారణంగా రోజువారీ ఎక్సర్ సైజ్ కు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇంట్లో అయినా సరే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. సుమారు 60 నిమిషాల పాటు ఎయిరోబిక్ ఎక్సర్ సైజ్ శరీరంలోని రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. వ్యాయామం ఫ్లూ రిస్క్‌ను తగ్గిస్తుంది. యోగా కూడా రోగనిరోధక ప్రతిస్పందనపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.
4. ప్రోబయాటిక్స్..
ప్రోబయాటిక్స్ గట్లో మంచి బ్యాక్టీరియా. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. అంతేకాదు,రోగనిరోధక శక్తిని కూడాపెంచుతుంది. ఇవి యోగర్ట్, ఇడ్లీ, దోశ, పుల్లనిపచ్చిళ్లు, చట్నీలలో ఉంటాయి. ప్రోబయాటిక్స్ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్లూ వైరస్‌లపై పోరాడడంలో ఫ్లూ వ్యాక్సినేషన్ ప్రభావాన్నిపెంచడంలో సహాయపడతాయి.
5. మంచి నిద్ర..
స్ట్రెస్ రోగనిరోధక వ్యవస్థను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల రిస్క్‌ను పెంచుతుంది. వర్షకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల హ్యాపీ హార్మోన్ తగ్గి స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. మంచి నిద్ర కూడా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల రిస్క్‌ను తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ అనేది రోగాలపై పోరాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలం సీజన్‌లో మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ సూచనలను పాటించి, ఆరోగ్యంగా ఉండండి.
ఇది కూడా చదవండి..నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2024 : కొవ్వులు ఆరోగ్యానికి హానికరం కాదా..? ఎందుకు..?
ఇది కూడా చదవండి..ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇది కూడా చదవండి..WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com