స్పాండిలోసిస్ అంటే ఏమిటి..? ఇది ఎలాంటి వారికి వస్తుంది..?
సాక్షి లైఫ్ : స్పాండిలోసిస్ సమస్య ఉన్నప్పుడు దిండు లేకుండా పడుకోకూడదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్ గా ఉంటుంది. సమస్య రెండో దశలో ఉన్నప్పటికీ మందులతో పాటు ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గక పొతే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
స్పాండిలోసిస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు..? మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగి.. రాపిడికి గురైనప్పుడు వెన్నుపూస నరాలపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా తలెత్తే నొప్పిని ‘స్పాండిలోసిస్’ అంటారు. ఈ నొప్పి తగ్గాలంటే.. ఏం చేయాలి..? అసలు ఈ సమస్య రాకుండా ముందుగా స్పాండిలోసిస్ నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మెంతులతో ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటిక్ పేషెంట్లు పొరపాటున కూడా ఈ పండ్ల రసాలు తాగకూడదు..
ఇది కూడా చదవండి..డయాబెటిక్ రోగులకు ఆక్యుపంక్చర్ ఎలాంటి ప్రయోజనాలున్నాయి..?
ఇది కూడా చదవండి..కొత్త పరిశోధన : కండరాల పనితీరులో బాదం కీలక పాత్ర
స్పాండిలోసిస్ వచ్చిన తర్వాత కానీ రాకముందుగానీ తప్పనిసరిగా చేయాల్సినవి, చేయకూడని వాటి గురించి తెలుసుకోవాలి. అవేంటంటే..? ఎక్కువగా బరువు ఉండే వస్తువులు.. అంటే సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, నీళ్లబక్కెట్లు, ల్యాప్‌టాప్‌లు మోయడం వంటివి చేయకూడదు. మూటలు, గంపలు వంటి అధికంగా బరువైనవాటిని కూడా తలపై మోయకూడదు.
రాత్రి సమయంలో పడుకునేతప్పుడు తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల దాకా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు మెడకు కొంత సపోర్ట్ గా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
ఒకవేళ తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా మడత వేసి దిండులా తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..చలికాలంలో ఉసిరికాయను ఇలా తీసుకుంటే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..
ఇది కూడా చదవండి..వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహారం తినాలి..?
ఇది కూడా చదవండి..ద్రాక్షలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు.. చలికాలంలో తింటే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
