కొత్త పరిశోధన : కండరాల పనితీరులో బాదం కీలక పాత్ర 

షేర్ చేయండి:
కొత్త పరిశోధన : కండరాల పనితీరులో బాదం కీలక పాత్ర 

సాక్షి లైఫ్ : బాదంపప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడటమే కాకుండా, నొప్పి తగ్గి, కండరాలు  దెబ్బతిన కుండా ఉంటాయని ఓ అధ్యయనం వెల్లడించింది. వ్యాయామం తర్వాత త్వరగా కండరాల పనితీరు మెరుగుపరచడంలో బాదంలు అద్భుతమైన పాత్ర పోషిస్తాయని ఓ పరిశోధన తెలిపింది. ఈ అధ్యయన ఫలితాలు కరెంట్ డెవలప్‌మెంట్స్ ఇన్ న్యూట్రిషన్ పత్రికలో ప్రచురించారు. ఈ పరిశోధనకు అవసరమైన నిధులు ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా సమకూర్చింది.

పరిశోధనలో భాగంగా..  

వ్యాయామానికి ముందు, తరువాత పరిశోధనలో పాలు పంచుకున్నవారి  కండరాల నొప్పి, కండరాల పనితీరును కండరాల సంకోచ పరీక్ష,వర్టికల్ జంప్ ద్వారా అంచనా వేశారు. కండరాల నొప్పి, క్రియేటిన్ కినేస్, సి-రియాక్టివ్ ప్రోటీన్, మయోగ్లోబిన్, యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం వంటివి పరిశోధకులు కొలిచారు. 

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?

 

పరిశోధకుల అభిప్రాయం.. 

శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్ డాక్టర్ మార్క్ కెర్న్ మాట్లాడుతూ.. బాదంలో ఉండే ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్‌లు కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో  సహాయపడతాయని, అయితే దీనిపై మరింతలోతైన పరిశోధనలు జరగాలని అన్నారు.


రెండు నెలల పాటు ప్రతిరోజూ 57గ్రాముల బాదంను తీసుకోవడం వల్ల వ్యాయామం చేసే వ్యక్తులలో క్రియేటిన్ కినేస్ స్థాయిలు వేగంగా క్షీణించడం ద్వారా బాదం కండరాల నొప్పిని సమర్థవంతంగా తగ్గించిబలాన్ని పెంచుతుందని న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పేర్కొన్నారు. 


బాదంలో ఉండే పోషక విలువలు.. 

57 గ్రాముల బాదంపప్పులో 12 గ్రా ప్రోటీన్, 8గ్రా ఫైబర్, 26 గ్రా అసంతృప్త కొవ్వు, 154ఎంజీ మెగ్నీషియం, 420ఎంజీ పొటాషియం, 14.414 ఎంజీ విటమిన్ "ఏ" ఉంటాయి.

ఎనిమిది వారాల పాటు 57గ్రాముల బాదంపప్పు తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు తగ్గి, కండరాల బలం పెరుగుతుంది, అలాగే వ్యాయామం తర్వాత కండరాల నష్టం తగ్గుతుంది.

పోషకాహార నిపుణుల అభిప్రాయం..  

షీలా కృష్ణస్వామి, రోహిణి పాటిల్, రితికా సమద్దర్ లాంటి పోషకాహార నిపుణులు కూడా బాదం తీసుకోవడం ద్వారా వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం, నొప్పి తగ్గించటం, బలాన్ని పెంచడంలో కీలకమైనదని చెబుతున్నారు. మొత్తంమీద ఈ పరిశోధన బాదంపప్పులు కండరాల పనితీరు, నొప్పి తగ్గించడం, వ్యాయామం తర్వాత వేగవంతంగా కోలుకోవడంలో సహాయపడుతుందని నిరూపిస్తోంది.

 

ఇది కూడా చదవండి..ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు..

ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు.. 

ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.