సాక్షి లైఫ్ : మనం ఎంతకాలం జీవిస్తామనేది కేవలం మనం తినే ఆహారం, చేసే వ్యాయామంపైనే ఆధారపడి ఉంటుందని అనుకుంటే పొరపాటే! మన ఆయుర్దాయాన్ని నిర్ణయించడంలో మన శరీరంలోని జన్యువులు (Genes) కీలక పాత్ర పోషిస్తాయని, దాదాపు 50 శాతం వాటా వాటిదేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనం పాత నమ్మకాలను పటాపంచలు చేస్తోంది.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
వాస్తవం..
గతంలో జరిగిన అనేక పరిశోధనలు ఆయుర్దాయంపై జన్యువుల ప్రభావం కేవలం 15 నుంచి 25 శాతమే ఉంటుందని భావించేవి. కానీ, ఈ కొత్త అధ్యయనం ప్రకారం అది ఏకంగా 50 శాతానికి చేరుకుంది. అంటే, మనం ఎంతకాలం జీవిస్తామనేది సగం మన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే జన్యువుల ద్వారానే ముందే నిర్ణయించబడుతోంది.
ఖచ్చితమైన విశ్లేషణ..
శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి రావడానికి ఒక ప్రత్యేకమైన గణిత నమూనాను (Mathematical Model) ఉపయోగించారు. 'సైన్స్' పత్రికలో ప్రచురితమైన ఈ కథనం ప్రకారం..ప్రమాదాలు, ఆకస్మిక ఇన్ఫెక్షన్లు వంటి బాహ్య కారణాల వల్ల సంభవించే మరణాలను మినహాయించి, కేవలం సహజసిద్ధమైన వృద్ధాప్య ప్రక్రియపై జన్యువుల ప్రభావాన్ని మాత్రమే పరిశోధకులు లెక్కించారు. అందుకే ఈ ఫలితాలు అత్యంత కచ్చితత్వంతో కూడి ఉన్నాయి. మనం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టే తీరు, మన అవయవాల పనితీరులో జన్యువుల పాత్ర గతంలో అనుకున్న దానికంటే చాలా ఎక్కువని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
జీవనశైలి పాత్ర లేనట్టేనా..?
జన్యువుల పాత్ర 50 శాతం ఉన్నప్పటికీ, మిగిలిన 50 శాతం మన చేతుల్లోనే ఉందని మర్చిపోకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మానసిక ప్రశాంతత వంటి అంశాలు మిగిలిన సగం ఆయుర్దాయాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి జీవనశైలి ద్వారా మనకున్న జన్యుపరమైన పరిమితులను కూడా కొంతవరకు అధిగమించి, ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది.
భవిష్యత్తు పరిశోధనలకు బాటలు..
వృద్ధాప్య ప్రక్రియను అర్థం చేసుకోవడంలోనూ, వయసు పెరగడం వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించడంలోనూ ఈ పరిశోధన కీలక మైలురాయిగా నిలవనుంది. దీర్ఘాయువుకు సంబంధించిన జన్యు రహస్యాలను ఛేదించడం ద్వారా రాబోయే కాలంలో మరింత మెరుగైన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com