తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?
సాక్షి లైఫ్ : తిప్పతీగ ఆకు పేరు మీరు వినే ఉంటారు. ఇది అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మూలిక. ఈ ఆకును ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కొన్నిరకాల ఔషధ గుణాలున్న పదార్థాలను, ఇతర మూలికలను ఒక్కో సమయంలో తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి వీలుకలుగుతుంది. తిప్పతీగ ఆకు అనేక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. అయితే వీటిని తీసుకునే ముందు, ఎప్పుడు తినాలి, దాని ప్రయోజనాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ఆయుర్వేదంలో..
ఆయుర్వేదంలో తిప్పతీగ ఒక ముఖ్యమైన మూలికగా ప్రసిద్ధి చెందింది. దాని ఔషధ గుణాల కారణంగా, ఇది వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేసే చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ కారణాల వల్ల చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు. మీరు కూడా వీటిని తీసుకోవాకోవాలనుకున్న ట్లయితే, దానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీరు తెలుసుకోవాలి.
తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు..
తిప్పతీగలో అనేక ఔషధ గుణాలున్నాయి. వీటిలో ఆల్కలాయిడ్స్, గ్లూకోసైడ్లు, టానిన్లు , ఇతర సమ్మేళనాలు ఉన్నాయి. ఈ కారణంగా, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇమ్మ్యూనిటీ బూస్టర్: శరీరం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తిప్పతీగ ఉపయోగపడుతుంది. ఇది వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: తిప్పతీగ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులతోపాటు ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
యాంటీ-ఆక్సిడెంట్: తిప్పతీగ యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది వృద్ధాప్యాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహం నియంత్రణ: తిప్పతీగ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది, ఇది టైప్-2 మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది.
హెల్తీ లివర్:తిప్పతీగ కాలేయ పని సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. టాక్సిన్స్ నుంచి కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తిప్పతీగ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం, అజీర్ణ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. తిప్పతీగను ప్రతిరోజూ పరగడుపున తీసుకోవడం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించే ఆహారం..
ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
