బ్లడ్ క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలి..?

సాక్షి లైఫ్ : బ్లడ్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీనిని "హెమటోలా జికల్ క్యాన్సర్" అని కూడా అంటారు. ఈ బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతకం అయినప్పటికీ, ప్రారంభదశలో ఆయా వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే, సరైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. బ్లడ్ క్యాన్సర్ ను ముందుకు అంటే ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఆయా  సంకేతాలను గురించి తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..  

ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

 
అలసట లేదా తరచుగా అంటువ్యాధులు..  

చాలా అలసటగా అనిపించడంతోపాటు, మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ల బారిన పడినట్లయితే, అది బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో ఒకటి కావచ్చు. ఎందుకంటే క్యాన్సర్ ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది రక్తహీనతకు కారణమవుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కూడా బ్లడ్ క్యాన్సర్ సంకేతమేనని వైద్య నిపుణులు అంటున్నారు. 
 
బరువు తగ్గడం.. 

 అకస్మాత్తుగా బరువు కోల్పోతే, అది బ్లడ్  క్యాన్సర్ మాత్రమే కాదు. ఇతర రకాల క్యాన్సర్ల ప్రారంభ లక్షణాలు కావచ్చు. వ్యాధితో పోరాడటానికి శరీరం శక్తిని ఖర్చు చేసినప్పుడే ఇది జరుగుతుంది. ఇది కాకుండా, కణుపులలో వాపు, ముఖ్యంగా మెడ, నడుము, లింఫోమా లక్షణం కావచ్చు, ఇది రక్త క్యాన్సర్ హెచ్చరిక సంకేతంగా పరిగణిస్తారు. 
 
ఎముకలలో రక్తస్రావం- తీవ్రమైన నొప్పి.. 

ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం వల్ల చిన్న గాయాలు అయినా ఎక్కువసేపు  రక్తస్రావం కావచ్చు. ఇది కొన్ని రకాల బ్లడ్  క్యాన్సర్‌లకు కూడా సంబంధించినది కావచ్చు. రక్త క్యాన్సర్ ఎముక మజ్జను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఎముకలలో నొప్పి లేదా పగుళ్లకు కారణం అవుతుంది. 
 
జ్వరం-రాత్రి చెమటలు.. 

ఎటువంటి కారణం లేకుండా జ్వరంతోపాటు, తరచుగా రాత్రిపూట చెమటలు పట్టడం అనేది బ్లడ్ క్యాన్సర్ కు సంకేతం. వీటితోపాటు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల, మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఆయా లక్షణాలను బట్టి సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించాలి.
 
బ్లడ్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి..? 

-క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా బ్లడ్ క్యాన్సర్‌ని గుర్తించవచ్చు. CBCలో ఏమైనా తేడా ఉంటే క్యాన్సర్ సమస్యకు సంకేతం కావచ్చు.

-బోన్ మ్యారో ఆస్పిరేషన్, బయాప్సీలో, బోన్ మ్యారో చిన్న నమూనాను పరీక్ష కోసం తీసుకుంటారు. ఈ పరీక్షలో బ్లడ్ క్యాన్సర్‌ ఉందాలేదా అనేది తెలిసిపోతుంది.

-ఈ వ్యాధిని CT స్కాన్, MRI లేదా PET స్కాన్ ద్వారా కూడా గుర్తించవచ్చు. కొన్ని అవయవాలు పనిచేయకపోవడం కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణమే.  

-బయాప్సీ ద్వారా క్యాన్సర్ కణాలను కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి చేయవచ్చు.
 
బ్లడ్ క్యాన్సర్ చికిత్స ఎలా..? 

బ్లడ్ క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే, అంతతొందరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభించినట్లయితే, ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతి ఉన్నాయి. అయినప్పటికీ,  బ్లడ్ క్యాన్సర్ విషయంలో ఆయా రకం , దశను బట్టి చికిత్స చేస్తారు. 

 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : blood-cancer blood-cells red-blood-cells blood white-blood-cells blood-hemoglobin blood-vessels improve-blood-circulation-in-legs blood-flow hematologic-malignancies hematology blood-cancers woman-blood-cancer-symptoms cause-blood-cancer
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com