ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ఆహార పదార్థాలు నిషేధం..?   

సాక్షి లైఫ్: ప్రపంచవ్యాప్తంగా, కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరమైనవి లేదా సామాజిక, ఆర్థిక కారణాల వల్ల నిషేధించారు. కొన్ని దేశాల్లో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు, పర్యావరణ పరిరక్షణకు, లేదా ఆహార భద్రతను పెంపొందించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.ఒక్కోదేశంలో కొన్నిరకాల నియమనిబంధన లుంటాయి. అక్కడి రూల్స్ ప్రకారం పరిపాలన జరుగుతుంటుంది. అందులోభాగంగానే కొన్ని దేశాలు పలురకాల ఆహారపదార్థాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఆయా ఆహారపదార్థాలను నిషేధించాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

ఇది కూడా చదవండి..పంటి నరాలకు, కంటి నరాలకు.. లింక్ ఉందా..?

ఇది కూడా చదవండి..హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?

ఇది కూడా చదవండి..తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?

ఇది కూడా చదవండి..గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి..

చూయింగ్ గమ్..  

ఆసియా ఖండంలోని హైపర్ క్లీన్, హైపర్ స్ట్రిక్ట్ దేశాలలో సింగపూర్ ఒకటి. ఈ దేశం ఆహార చట్టాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇక్కడ చూయింగ్ గమ్ తినడంపై నిషేధం ఉంది. కానీ ఇక్కడి కిరాణా షాపుల్లో చూయింగ్ గమ్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ చూయింగ్ గమ్ కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా డాక్టర్ ప్రిష్కిప్షన్ తప్పనిసరి. 
అలా అయితేనే చూయింగ్ గమ్ కొనుగోలు చేయడానికి వీలుంటుంది.

సమోసా.. 

 లోపల మసాలాతోపాటు బంగాళాదుంప మిశ్రమం.. త్రిభుజాకారంలో ఉన్న సమోసా, చట్నీ, ఒక కప్పు "టీ" తో చాలామంది రోజులు గడిపేస్తుంటారు. బయట క్రిస్పీ గానూ లోపల స్మూత్ గా ఉంటుంది. ఐతే అద్భుతమైన రుచి ఉన్న ఈ సమోసాను సోమాలియా దేశంలో పూర్తిగా నిషేధించారు.

 చ్యవన్ ప్రాష్

ఇది భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్‌లో అత్యంత సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా పరిగణిస్తారు. కానీ ఇందులో ఉండే మార్ఫిన్ కంటెంట్ కారణంగా సింగపూర్, తైవాన్లలో నిషేధించారు. చ్యవన్ ప్రాష్ ను సింగపూర్‌లోని "సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో "నిషేధిందించింది. దీనిని సౌదీ అరేబియాలోనూ కెనడాలోనూ నిషేధించారు. 

 కిండర్ జాయ్.. 

టీవీలో కిండర్ జాయ్ ప్రకటన వస్తే, పిల్లలు దానిని కొనమని తల్లిదండ్రులను పట్టుబడుతుంటారు. కిండర్ జాయ్ ని యునైటెడ్ స్టేట్స్‌లో నిషేధించారు. ప్లాస్టిక్‌ను అక్కడి ప్రభుత్వం అనుమతించదు. ముఖ్యంగా పిల్లలు తినే ఆహార పదార్థాలు ఈ దేశంలో చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు.

 కెచప్.. 

ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కానీ వాటితో కెచప్ ఉన్నప్పుడే వాటిని తింటే టేస్టీగా ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే.. ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఫేమస్ వంటకాన్ని కెచప్‌తో ఫ్రాన్స్‌లోనే తినలేరు. ఎందుకంటే..? ఫ్రాన్స్‌లోని పాఠశాలల్లో కెచప్ నిషేధించారు.  కారణమేమిటంటే..? ఇక్కడి పాఠశాలల్లో ఫ్రాన్స్ సంప్రదాయ వంటకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

గీ పై నిషేధం.. 

భారతదేశంలోని ప్రజలు నెయ్యి తినడానికి ఇష్టపడుతారు. కానీ అమెరికాలో మాత్రం నిషేధించారు. అక్కడి ఆరోగ్య సూత్రాల ప్రకారం నెయ్యి తింటే అధిక రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందట. అందుకోసమే నెయ్యి ఆ దేశంలో అమ్మరు, కొనరు.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

 ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి.. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : kids-health healthy-food kids-health-care bad-food eating-habits kids,food ghee best-food countries world healthy-habit chewing-gum samosa
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com