Central Obesity : డయాబెటీస్,గుండె జబ్బులకు 'సెంట్రల్ ఒబెసిటీ' సంకేతం.. హెచ్చరిస్తున్న నిపుణులు..
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం భారతీయుల ఆరోగ్యాన్ని చిక్కుల్లో పడేస్తోంది. ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయే కొవ్వు (Belly Fat) తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని కేవలం సౌందర్య సమస్యగా కాకుండా, ప్రాణాంతక వ్యాధులకు ముందస్తు హెచ్చరికగా గుర్తించాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ప్రముఖ జర్నల్ ‘డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్’ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం.. సాధారణ ఊబకాయం కంటే పొట్ట చుట్టూ పేరుకుపోయే 'విసెరల్ ఫ్యాట్' అత్యంత ప్రమాదకరమైనది. ఇది కాలేయం, ప్యాంక్రియాస్ వంటి కీలక అవయవాల పనితీరును దెబ్బతీసి టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తోంది.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్‌తోనే ముప్పు..!
మనం రోజూ తీసుకునే చిప్స్, బిస్కెట్లు, శీతల పానీయాలు, ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటి పదార్థాల్లో చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటున్నాయి. ఇవి ఆకలిని పెంచి, అతిగా తినేలా ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇవి చిన్న వయసులోనే ఊబకాయానికి, రక్తపోటుకు కారణమవుతున్నాయి.
పరిశోధనలోని అంశాలు..
తక్కువ శ్రమ - ఎక్కువ కొవ్వు.. నగర జీవనంలో వ్యాయామం తగ్గడం వల్ల కండరాలు కరిగి, కొవ్వు పేరుకుపోతోంది. భారతీయులు చూడటానికి సన్నగా ఉన్నా, పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది (Thin-fat phenotype). దీనివల్ల తక్కువ వయసులోనే మెటబాలిక్ వ్యాధుల బారిన పడుతున్నారు. కేవలం బాడీ మాస్ ఇండెక్స్ (BMI) మాత్రమే కాకుండా, నడుము చుట్టుకొలతను కూడా ఆరోగ్య సూచికగా పరిగణించాలని వైద్యులు చెబుతున్నారు.
పరిష్కారం ఇంటి నుంచే..
వ్యాధుల నుంచి బయటపడాలంటే మందుల కంటే జీవనశైలి మార్పులే కీలకమనివైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిరుధాన్యాలు (మిల్లెట్స్), తృణధాన్యాలు, పప్పులు, తాజా కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలల్లో, ఇంట్లో పిల్లలు శారీరక శ్రమ చేసేలా చూడాలి. ప్రాసెస్ చేసిన ఆహారానికి వారిని దూరంగా ఉంచాలి. ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు తప్పనిసరి.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
