Childhood Obesity : దేశంలో కలవరపెడుతున్న చైల్డ్ ఒబెసిటీ.. ఉత్తరాదిలోనే అత్యధికం..!
సాక్షి లైఫ్ : దేశంలో మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న తరుణంలో చిన్నారుల ఆరోగ్యంపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో దాదాపు 7 శాతం ప్రతి 14 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని జాతీయ స్థాయి విశ్లేషణ వెల్లడించింది. ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ పరిశోధకులు, భారత్, బ్రిటన్ నిపుణులతో కలిసి 1995 నుంచి 2023 వరకు జరిగిన 125 అధ్యయనాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
పరిశోధనలో..
ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ పరిశోధకులు, భారత్, బ్రిటన్ నిపుణులతో కలిసి 1995 నుంచి 2023 వరకు జరిగిన 125 అధ్యయనాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. దేశవ్యాప్తంగా సగటున 6.97 శాతం మంది పిల్లలు ఊబకాయంతో ఉన్నారు. ఇందులో ఉత్తర భారతం 8.58 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, మధ్య భారతం 5.63 శాతంతో అత్యల్పంగా ఉంది.
కాలక్రమేణా పిల్లల్లో బరువు పెరగడం నిలకడగా పెరుగుతోందని పరిశోధన వెల్లడించింది. ఇది కేవలం నగరాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది.
కారణాలు ఏంటి..?
ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, పంచదార పానీయాలు, ప్యాకేజ్డ్ స్నాక్స్ వినియోగం పెరిగింది. ఆరోగ్యకరమైనవిగా మార్కెట్ చేసే అనేక ఆహార పదార్థాలు క్యాలరీలతో నిండి ఉండటం గమనార్హం. చదువుల ఒత్తిడి, పెరిగిన స్క్రీన్ టైమ్ టీవీ, మొబైల్ ఎక్కువగా చూడడం, నిద్రలేమి, బయట ఆడుకునే అలవాటు తగ్గడం వంటివి ఊబకాయానికి దారితీస్తున్నాయి.
చిన్నతనంలో వచ్చే ఊబకాయం భవిష్యత్తులో మధుమేహం, గుండె జబ్బుల వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని ఎయిమ్స్ డైటీషియన్ డాక్టర్ అంజలి భోలా తెలిపారు. ఇప్పటికే పిల్లల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ-డయాబెటిస్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పంచదార పానీయాలను తగ్గించి, ఇంటి ఆహారం, శారీరక శ్రమను పెంచడం ద్వారానే ఈ ముప్పును అరికట్టవచ్చని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
