Health Study : భారతీయ తల్లులలో తీవ్ర అనారోగ్యసమస్యలు.. తాజా సర్వేలో పలు ఆందోళనకర అంశాలు వెల్లడి..  

షేర్ చేయండి:
Health Study : భారతీయ తల్లులలో తీవ్ర అనారోగ్యసమస్యలు.. తాజా సర్వేలో పలు ఆందోళనకర అంశాలు వెల్లడి..  

సాక్షి లైఫ్ : మాతృత్వం అనేది ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. అయితే, భారతీయ మహిళల విషయానికి వస్తే.. ఈ తొలి అధ్యాయం శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా ఎంతో సవాలుతో కూడుకున్నదిగా మారుతోంది. ఈ కాలంలో వారి ఆరోగ్యం అనేక రకాలుగా దెబ్బతింటోందని ఇటీవల వెలువడిన ఒక నివేదిక దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

మనదేశంలో మహిళల ఆరోగ్యం ఎప్పుడూ ఆందోళనకరంగానే ఉంటోంది. ఇప్పటికే సుమారు 57 శాతం మంది మహిళలు, బాలికలు రక్తహీనత (Anemia) బారిన పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతుండగా.. ఇప్పుడు కొత్తగా తల్లులైన వారిని మరో రెండు ప్రధాన సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నట్లు తాజాగా తేలింది.

ప్రముఖ హెయిర్-కేర్ బ్రాండ్ 'ట్రియా' (Traya) సుమారు 76,727 మంది భారతీయ తల్లులపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. ఈ అధ్యయనంలో ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారు, ఏడాది లోపు పిల్లలు ఉన్నవారు, పాలిచ్చే తల్లులు పాల్గొన్నారు.

నిద్ర కరవై.. ఒత్తిడి పెరిగి..!

ఈ అధ్యయనం ప్రకారం, దేశంలో ప్రతి ఇద్దరు తల్లులలో ఒకరు తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి (Insomnia) సమస్యలతో సతమతమవుతున్నారు.
దాదాపు 53 శాతానికి పైగా తల్లులు తమకు తగినంత నిద్ర దొరకడం లేదని వాపోయారు. రాత్రిపూట పిల్లల కోసం పదే పదే మేల్కొనడం, రోజుకు కనీసం 5 గంటలు కూడా నిద్రపోలేకపోవడం వంటి సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. కేవలం 31.57 శాతం మంది మాత్రమే ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నట్లు తెలిపారు.

ఆందోళన గుప్పిట్లో మాతృత్వం: దాదాపు 47.35 శాతం మంది తల్లులు తాము 'తీవ్ర ఒత్తిడి'కి లోనవుతున్నామని వెల్లడించారు. వారంలో చాలా రోజులు లేదా ప్రతిరోజూ ఏదో ఒక విషయమై ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మరో 34.54 శాతం మంది ఒత్తిడి ఉన్నప్పటికీ, దానిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

ఆరోగ్యానికి 'పెను ముప్పు'..

దీర్ఘకాలికంగా వేధించే ఒత్తిడి, నిద్రలేమి కేవలం మానసిక ప్రశాంతతను మాత్రమే కాదు.. శరీర ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జుట్టు రాలడం ఒక సంకేతం మాత్రమే..!

గర్భధారణ సమయంలో కాన్పు తర్వాత వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల చాలా మంది మహిళల్లో జుట్టు వేగంగా రాలిపోతుంది. అయితే నిరంతర ఒత్తిడి, అలసట వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇది కేవలం జుట్టు సమస్య మాత్రమే కాదు.. మహిళలు తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటూ, కుటుంబ బాధ్యతల్లో పడి ఆరోగ్యాన్ని ఎలా పాడుచేసుకుంటున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం" అని ట్రియా హెల్త్ సహ-డైరెక్టర్ సలోని ఆనంద్ పేర్కొన్నారు.

నిద్రలేమితో..

సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. కానీ కొత్త తల్లులకు ఇది దొరకడం గగనంగా మారింది. నిద్ర లోపించడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే 'కార్టిసాల్' (Cortisol) హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల చిరాకు, ఆందోళన, మానసిక అలసట ఎక్కువవుతాయి. దీర్ఘకాలంలో ఇది అధిక రక్తపోటు (bp), మధుమేహం (diabetes), ఊబకాయం(obesity), గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

నిరంతర ఒత్తిడి ఎంత ప్రమాదకరం..?

నిరంతరం ఒత్తిడికి గురవడం వల్ల శరీరం నిరంతరాయంగా కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఇది శారీరక, మానసిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. మానసిక సమస్యలు: డిప్రెషన్ (depression), పానిక్ డిజార్డర్స్ వంటి తీవ్ర మానసిక సమస్యలకు దారితీస్తుంది. శారీరక ప్రభావం.. జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, గుండె ఆరోగ్యం క్షీణించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

తల్లి మానసిక శారీరక ఆరోగ్యంపైనే ఇల్లాలు, పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి, కొత్తగా తల్లులైన వారికి కుటుంబ సభ్యులు అండగా నిలవాలని, వారికి తగినంత విశ్రాంతి లభించేలా బాధ్యతలను పంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.