New Guidelines on Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ పై కొత్త మార్గదర్శకాలు..! గుండె ఆరోగ్యంకోసం పరిశోధకుల కీలక సూచనలు

షేర్ చేయండి:
New Guidelines on Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ పై కొత్త మార్గదర్శకాలు..! గుండె ఆరోగ్యంకోసం పరిశోధకుల కీలక సూచనలు

సాక్షి లైఫ్ : అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (ACC) అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) సంయుక్తంగా, గుండె సంరక్షణ కోసం మార్గదర్శకాలను రూపొందించాయి. శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ (LDL-C) వల్ల కలిగే గుండె జబ్బుల ముప్పును తగ్గించేందుకు 2026(ACC/AHA) సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి. గతంలో ఉన్న గందరగోళానికి తెరదించుతూ, ఈసారి రోగుల ముప్పును బట్టి స్పష్టమైన కొలెస్ట్రాల్ లక్ష్యాలను (Targets) నిర్ణయించింది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ ప్రివెంటివ్ కార్డియాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ రోజర్ బ్లూమెంటల్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ ప్రతిపాదనలు చేసింది.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

గుర్తుంచుకోవాల్సినవి.. 

కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎలా ఉండాలనేదానిపై నిపుణులు పలు మార్గదర్శకాలు అందిస్తున్నారు. సాధారణవ్యక్తుల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 100 mg/dL కన్నా తక్కువగా ఉండాలి. ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నవారిలో 70 mg/dL కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నవారు (Very High Risk) తమ కొలెస్ట్రాల్‌ను 55 mg/dL కన్నా తక్కువగా ఉండాలని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.


ఇప్పటివరకు ఫాలో అయిన పాత పద్ధతుల కంటే 'ప్రివెంట్' (PREVENT) అనే కొత్త విధానం మరింత ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని వైద్యనిపుణులు అంటున్నారు. ఇది సుమారు 66 లక్షల మంది సమాచారంతో రూపొందించారు. దీని ప్రకారం ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చే అవకాశం 5 శాతం ఉన్నా.. వెంటనే స్టాటిన్ వంటి మందులను ప్రారంభించాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

క్యాల్షియం స్కోరింగ్ (CAC) తో స్పష్టత.. 

కొలెస్ట్రాల్ మందులు వాడాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు 'కొరోనరీ ఆర్టరీ క్యాల్షియం' (CAC) పరీక్ష ఒక 'టై బ్రేకర్' లా పనిచేస్తుంది.

క్యాల్షియం స్కోర్ సున్నా ఉంటే, మందుల కంటే జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టవచ్చు.

స్కోర్ 1000 దాటితే మాత్రం కొలెస్ట్రాల్‌ను 55 లోపు ఉంచుకోవడం అత్యవసరం.

లిపోప్రోటీన్ (ఏ) - Lp(a)..  

జీవితంలో ఒక్కసారైనా Lp(a) పరీక్ష చేయించుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇది జన్యుపరంగా వచ్చే ముప్పు. దీని విలువ 125 దాటితే 40శాతం ముప్పు పెరిగినట్టు, 250 దాటితే గుండె జబ్బుల ముప్పు రెట్టింపు అయినట్లు భావించాలి.

ముందు జాగ్రత్తే మందు..!

 కేవలం మందుల మీదనే ఆధారపడకుండా, ప్రతిరోజూ వ్యాయామం, బరువు తగ్గడం, శాకాహార ప్రాముఖ్యత కలిగిన ఆహారం (Plant-forward diet) తీసుకోవడం చాలా ముఖ్యం" అని డాక్టర్ బ్లూమెంటల్ పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే రక్తపోటు (బిపి) 120 లోపు, కొలెస్ట్రాల్ 70 లోపు ఉంచుకుంటే దీర్ఘకాలంలో గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని ఈ నివేదిక సారాంశం.

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.