ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్.. భారత్ లో మరింతగా పెరుగుతున్న కేసులు
సాక్షి లైఫ్ : ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రాథమికంగా కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది. ఈ సమస్య భారతదేశంలో సర్వసాధారణంగా మారుతోందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించే లక్షణాలు లేకపోవటంతో ఈ పరిస్థితిని ప్రారంభ దశలలో కనుక్కోలేకపోతున్నారు. దీంతో చాలామంది ఈ ఫ్యాటీ లివర్ వ్యాధి బారీన పడుతున్నారు.
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
చికిత్స చేయకుండా వదిలేస్తే..
ఫ్యాటీ లివర్ కు చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌తో సహా మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. భారతదేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి కేసుల ప్రాబల్యం 9శాతం నుంచి 38శాతం వరకు పెరిగిందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు దీని బారిన పడుతున్నారు. భయంకరంగా 2023లో ఎయిమ్స్ (AIIMS) నిర్వహించిన ఒక అధ్యయనంలో దాదాపు 35శాతం కేసులు పిల్లలలో సంభవిస్తున్నాయని గుర్తించారు.
అవగాహన కల్పించేందుకు..
ఫ్యాటీ లివర్ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి అవగాహన కల్పించేందుకు రూబీ హాల్ క్లినిక్ తమ ఉద్యోగులను వ్యాధిని పరీక్షించ డానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. దీని కోసం, ఆసుపత్రి ఫైబ్రోస్కాన్ యంత్రాన్ని ఉపయోగిస్తుంది. దీనిపై, రూబీ హాల్ క్లినిక్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ , జిఐ ఎండోస్కోపీ కన్సల్టెంట్ ,హెడ్ డాక్టర్ నితిన్ పాయ్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.
" తీవ్రమైన కాలేయ వ్యాధులు పెరగకుండా ఉండాలంటే ఈ సమస్యను ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. మా అవగాహన ప్రచారం ద్వారా, ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ ఎక్కువమంది కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చురుకైన చర్యలు తీసుకుని వారిని ప్రోత్సహించడం మా లక్ష్యం" అని ఆయన అన్నారు. ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కాలేయ ఆరోగ్యంతోపాటు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ పాయ్ చెప్పారు.
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
