ఈ సమస్యకు ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే సరైన పరిష్కారం..
సాక్షిలైఫ్: ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో అనేకరకాలుంటాయి. నాన్ వెజ్, వెజ్ తోపాటు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కూడా మనం తినే ఆహారంలో ఒకటి. ఒక్కోరకమైన ఆహారం తీసుకోవడం వల్ల కొన్నిరకాల ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అలాగే మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మొక్కల ఆధారిత ఆహారం గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. అయితే ఇది స్లీప్ అప్నియా సమస్యను నివారించడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా..? అవును, ఈ విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్లీప్ అప్నియా సమస్యను నివారించడంలో మొక్కల ఆధారిత ఆహారం ఎలా ఉపయోగ పడుతుందంటే..?
ఇది కూడా చదవండి.. మహిళల్లో వైట్ డిశ్చార్జ్ కు ప్రధాన కారణాలు..?
మొక్కల ఆధారిత ఆహారం..
ఈ అధ్యయనంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు కలిగిన ఆహారం తీసుకున్న వారిలో స్లీప్ అప్నియా ప్రమాదం గణనీయంగా తగ్గిస్తుంది. మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు స్లీప్ అప్నియా వచ్చే ప్రమాదం 19 శాతం కంటే తక్కువగా ఉందని, ప్రాసెస్ చేసిన ధాన్యాలు, ఎక్కువ వేయించిన ఆహారాలు, ఎక్కువ ఉప్పు, చక్కెర ఉన్న ఆహారాలు వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే వ్యక్తులలో ఈ సమస్య ఎక్కువగా వస్తుందని ఈ అధ్యయనం తేల్చింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని తినే వారికి స్లీప్ అప్నియా వచ్చే ప్రమాదం చాలా తగ్గుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఊబకాయం..
మొక్కల ఆధారిత ఆహారం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉండటమే దీనికి ఒక కారణమని పరిశోధకులు చెబుతున్నారు. అధిక బరువు , స్లీప్ అప్నియాకు ప్రధాన కారణమని, మొక్కల ఆధారిత ఆహారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.ఇది కూడా చదవండి.. బొప్పాయి
ఇది కూడా చదవండి. ఈపండు తింటే వేడి చేస్తుందా..? ఎంతవరకు నిజం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
