Pomegranate : ప్రాణాంతక గడ్డలకు చెక్ పెట్టే దానిమ్మ.. కుమామోటో యూనివర్శిటీ తాజా పరిశోధనలో వెల్లడి..
సాక్షి లైఫ్ : సాధారణంగా మనం దానిమ్మ పండ్లను ఆరోగ్యానికి మేలు చేస్తాయని తింటాం. కానీ ఆ చెట్టు ఆకులు, కొమ్మల్లో కూడా ప్రాణాలను రక్షించే అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని జపాన్‌లోని కుమామోటో యూనివర్శిటీ పరిశోధకులు తాజాగా గుర్తించారు. శరీరంలో పేరుకుపోయే ప్రమాదకరమైన 'అమిలాయిడ్' (Amyloid) ప్రోటీన్ గడ్డలను ఇవి సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఏమిటీ సమస్య..?
మన శరీరంలో 'ట్రాన్స్‌థైరెటిన్' (TTR) అనే ప్రోటీన్ తన సహజ రూపాన్ని కోల్పోయి, గట్టి గడ్డల్లా మారి అవయవాల్లో పేరుకుపోతుంది. దీన్నే 'అమిలాయిడ్ ఎమైలాయిడోసిస్' అంటారు. ఇది ప్రధానంగా:
నరాల బలహీనత, చేతులు, కాళ్లు మొద్దుబారిపోవడం. గుండె జబ్బులు, గుండె కండరాలు బిగుసుకుపోయి వైఫల్యానికి దారితీయడం వంటి తీవ్ర సమస్యలను కలిగిస్తుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు కొత్త గడ్డలు ఏర్పడకుండా ఆపగలవు కానీ, ఇప్పటికే పేరుకుపోయిన పాత గడ్డలను తొలగించలేవు. కాబట్టి దానిమ్మ ఇలాంటి మొండి గడ్డలను సైతం అరికడుతుంది.
పరిశోధనలో తేలిందేమిటి అంటే..?
శాస్త్రవేత్తలు దాదాపు పదిహేను వందల రకాల మొక్కల సారాన్ని పరిశీలించగా, దానిమ్మ (Punica granatum) ఆకులు, కొమ్మల నుంచి తీసిన సారం అద్భుత ఫలితాలను చూపింది. అందులోని PGG (1,2,3,4,6-penta-O-galloyl-β-D-glucose) అనే రసాయనం అమిలాయిడ్ గడ్డలను నేరుగా ముక్కలు చేసినట్లు గుర్తించారు పరిశోధకులు. రోగుల నుంచి సేకరించిన గుండె కణజాలంపై ఈ రసాయనాన్ని ప్రయోగించగా, అది పేరుకుపోయిన ప్రోటీన్ గడ్డలను విజయవంతంగా విచ్ఛిన్నం చేసింది.
ప్రయోగశాలలో చిన్నపాటి జీవులపై (C. elegans) జరిపిన పరిశోధనలో, ఈ దానిమ్మ రసాయనం వల్ల వాటిలోని ప్రోటీన్ నిక్షేపాలు తగ్గి, ఆయుష్షు పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. దానిమ్మ ఆకుల్లోని ఈ ప్రత్యేక సమ్మేళనం కేవలం వ్యాధి పెరగకుండా ఆపడమే కాకుండా, ఇప్పటికే శరీరంలో ఉన్న హానికర నిక్షేపాలను తొలగించే అవకాశం ఉంది. ఇది ఎమైలాయిడోసిస్ చికిత్సలో ఒక కీలక మలుపని కుమామోటో యూనివర్శిటీ పరిశోధక బృందం చెబుతోంది.
ఈ రసాయనం కేవలం హానికరమైన ట్రాన్స్‌థైరెటిన్ గడ్డల మీదనే పనిచేస్తుందని, మెదడుకు సంబంధించిన ఇతర అమిలాయిడ్లపై ప్రభావం చూపడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంటే ఇది చాలా సురక్షితంగా, నిర్దేశిత లక్ష్యంపైనే పనిచేస్తుందన్నమాట. త్వరలోనే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
