Disease Risk : అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలతో రోగాల ముప్పు: 88 లక్షల మందిపై అధ్యయనంలో వెల్లడి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఈ జనరేషన్ లో ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. మన పూర్వీకులు అప్పటి అలవాట్లతో ఎంతో ఆరోగ్యంగా హాయిగా జీవించారు. కానీ నేటితరం మాత్రం అనేక ఆనారోగ్యాల బారీన పడుతోంది. దీనికి ప్రధాన కారణం ప్యాకేజ్డ్ స్నాక్స్, శీతల పానీయాలు, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్డ్ మాంసం వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలే. ఇవి ఎక్కువగా తినేవారికి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. 51 అధ్యయనాల్లోని సుమారు 88 లక్షల మంది పెద్దల సమాచారాన్ని పరిశోధకులు పరిశీలించారు. ఈ అధ్యయనాలు అమెరికా, యూరప్, ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు చెందినవి.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ప్రధాన అంశాలు..

రోజూ అదనంగా 100 గ్రాములు అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారం తీసుకుంటే..

గుండె సంబంధిత సమస్యల ముప్పు 14శాతం పెరిగింది.
అధిక రక్తపోటు ముప్పు 11శాతం పెరిగింది.
క్యాన్సర్ ముప్పు 4శాతం పెరిగింది.
మరణించే ముప్పు 3శాతం పెరిగింది.
మెటబాలిక్ సిండ్రోమ్ లేదా మధుమేహం ముప్పు 2శాతం పెరిగింది.

ఈ ఆహారాలను అత్యధికంగా తినేవారిలో ఊబకాయం, డిప్రెషన్, ఆందోళన, జీర్ణ సంబంధ వ్యాధులు కూడా ఎక్కువగా కనిపించాయి.

గమనించాల్సినవి..

ఇది పరిశీలనాత్మక అధ్యయనం.. ఇందులో పాల్గొన్నవారు చెప్పిన ఆహారపు అలవాట్లపై ఆధారపడింది కాబట్టి, ఈ ఆహారాలే వ్యాధులకు కారణమని నిరూపించలేం. కేవలం సంబంధాన్ని మాత్రమే సూచిస్తుంది. అలాగే అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారానికి వేర్వేరు నిర్వచనాలు ఉండటం వల్ల పోలికలకు పరిమితులు ఉన్నాయి.

ఈ ఆహారాలను తగ్గించి, తాజా కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, ఇంట్లో వండిన ఆహారం వంటి తక్కువ ప్రాసెసింగ్ ఉన్న ఆహారాలకు మారడం దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు సహాయపడవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరమని కూడా స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.