WHO: క్షయవ్యాధి (TB) నియంత్రణకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలు..!
సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) క్షయవ్యాధి (టీబీ) నివారణ, చికిత్సకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలలో టీబీ చికిత్సలో పోషకాహారం (Nutrition) ఆహార సహాయానికి (Food Assistance) అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కీలకమని, ఇకపై, కేవలం మందులు మాత్రమే కాకుండా, రోగులకు, వారి కుటుంబాలకు ఆహార సహాయాన్ని అందించాలని WHO ప్రపంచ దేశాలకు సిఫార్సు చేసింది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
పోషకాహార లోపమే ప్రధాన సమస్య..
ప్రపంచవ్యాప్తంగా టీబీ వ్యాప్తికి, చికిత్స తర్వాత రోగులు త్వరగా కోలుకోకపోవడానికి పోషకాహార లోపం (Undernutrition) ఒక ప్రధాన కారణంగా ఉందని WHO గుర్తించింది. పౌష్టికాహారం సరిగా లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, టీబీ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని, అలాగే చికిత్సకు ప్రతిస్పందన కూడా ఆలస్యం అవుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి.
భారతీయ పరిశోధన కీలకం..
ఈ నూతన మార్గదర్శకాల వెనుక భారతీయ పరిశోధకుల కృషి కూడా ఉంది. మంగళూరుకు చెందిన డాక్టర్ అనురాగ్ భార్గవ, డాక్టర్ మాధవి భార్గవ నేతృత్వంలో నిర్వహించిన 'రేషన్స్' (RATIONS - Reducing Activation of Tuberculosis by Improvement of Nutritional Status) ట్రయల్ లో కీలక ఆధారాలు లభించాయి. ఆహార అభద్రత ఉన్న ప్రాంతాల్లోని టీబీ రోగుల కుటుంబాలకు ఆహార సహాయం అందించడం ద్వారా, ఆ కుటుంబ సభ్యులకు టీబీ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
