హెచ్ పీవీ వ్యాక్సిన్ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా..?

షేర్ చేయండి:
హెచ్ పీవీ వ్యాక్సిన్ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా..?

సాక్షి లైఫ్ : గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన వ్యాధి. ఈ క్యాన్సర్‌ను హెచ్ పీవీ వ్యాక్సిన్ ద్వారా నిరోధించవచ్చు. హెచ్ పీవీ టీకాకు సంబంధించి చాలామందిలో అనేక అపోహలున్నాయి. దీని కారణంగా ఎక్కువమంది హెచ్ పీవీ టీకా తీసుకోవడానికి ముందుకు రావడంలేదు. ఈ వ్యాధి గురించి ఈ టీకా గురించి అవగాహన అవసరమని పరిశోధచెబుతున్నారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి, హెచ్ పీవీ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఈ వ్యాక్సిన్ చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?


అపోహ : హెచ్ పీవీ వ్యాక్సిన్ సురక్షితం కాదు.
 
వాస్తవం: అనేక సంవత్సరాల అధ్యయనం, నిరంతర పర్యవేక్షణ తర్వాత, హెచ్ పీవీ వ్యాక్సిన్ అన్ని ఇతర వ్యాక్సిన్ల మాదిరిగానే సురక్షితమైనదని నిరూపించారు శాస్త్రవేత్తలు. దీన్ని ఉపయోగించడానికి అనుమతి పొందే ముందు ఇది అనేక ప్రయోగాలు నిర్వహించారు. చాలా సందర్భాలలో కొద్దిపాటి రియాక్షన్స్ ఉంటాయి. అటువంటివాటిలో టీకా చేసిన ప్రాంతంలో నొప్పి లేదా తేలికపాటి జ్వరం వంటివి వస్తుంటాయి.

అపోహ :  మీరు లైంగికంగా చురుకుగా లేకుంటే, టీకా అవసరం లేదు.

వాస్తవం: హెచ్ పీవీ బారిన పడటానికి ముందు, సాధారణంగా 11 సంవత్సరాల వయస్సులో ఇచ్చినప్పుడు టీకా బాగా పనిచేస్తుంది. ఎవరైనా ప్రస్తుతం లైంగికంగా చురుకుగా లేకపోయినా, భవిష్యత్తు కోసం వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.