తల్లి పాలివ్వడానికి సంబంధించిన అపోహలు-వాస్తవాలు  

షేర్ చేయండి:
తల్లి పాలివ్వడానికి సంబంధించిన అపోహలు-వాస్తవాలు  

సాక్షి లైఫ్ : నవజాత శిశువులకు తల్లి పాలు సంపూర్ణ ఆహారం. అమ్మ పాల ద్వారా చిన్నారులకు శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7తేదీ  వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారు. తల్లిపాలను గురించి చాలా అపోహలు ఉన్నాయి.. అవి వాస్తవమా కాదా అనేది తెలుసుకోవడం ముఖ్యం.

ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

ప్రసవం తర్వాత తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొందరు తల్లులు తమ బిడ్డతో బంధాన్ని పెంచుకోలేరు. అలాంటి వారు డిప్రెషన్‌కు గురవుతారు. అటువంటి ప్రమాదాలను తగ్గించడానికి తల్లిపాలు ఎంతగానో మేలు చేస్తాయి. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు మేలు సినప్పటికీ, ఉత్తమమైన ఆహారం గురించి అనేక అపోహలు ఉన్నాయి.  

అపోహ- పాలివ్వడం వల్ల నొప్పిగా అనిపిస్తుందా..? 

తల్లి పాలిచ్చేటప్పుడు సరైన పద్దతిలో కూర్చోక పోతే ఈ ప్రక్రియ నొప్పిగా ఉంటుంది. సరైన విధానంలో కూర్చొని పాలివ్వడం వల్ల ఈ నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

 అపోహ- బిడ్డకు తల్లి పాలిచ్చే తల్లులు ఎలాంటి మందులు తీసుకోకూడదు.

వాస్తవం..  

 వైద్యులు డెలివరీ తర్వాత తల్లులు త్వరగా కోలుకోవడానికి అనేక రకాల మందులు ఇస్తారు. వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి. కాకపోతే సొంతంగా ఎలాంటి మాత్రలు, ఔషధాలు తీసుకోకూడదు. చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి సమస్యకైనా మందు వేసుకోవాలనుకుంటే తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. ఇది కాకుండా ఏ ఔషధం తీసుకుంటున్నారో పిల్లల వైద్యుడికి కూడా తెలియజేయాలి.

  అపోహ- తల్లి అనారోగ్యంతో ఉంటే పాలు ఇవ్వకూడదు.
 
వాస్తవం.. వ్యాధి రకాన్ని బట్టి ఉంటుంది. ఎలాంటి వ్యాధి వహ్సినప్పుడు ఇవ్వాలి..? ఇవ్వకూడదు అనేది ఆధారపడుతుంది. మందులు తీసుకునే తల్లులు సాధారణంగా తల్లిపాలు కూడా ఇవ్వవచ్చు. వైద్యుడిని సంప్రదించకుండా మందులు తీసుకోకూడదని గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.