ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలలో వచ్చే వ్యాధులు...

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో వచ్చే అనారోగ్యసమస్యలు.. తల్లి ,బిడ్డ ఇద్దరినీ ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. డిప్రెషన్ అనేది గర్భధారణ సమయంలో స్త్రీలను మరింతగా ప్రభావితం చేసే సమస్య. మహిళల్లో ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్ గురించి చాలా చర్చలు జరుపుతారు. కానీ గర్భధారణ సమయంలో డిప్రెషన్ గురించి పెద్దగా మాట్లాడరు.

ఇది కూడా చదవండి..క్యాన్సర్‌ : ఈ 5 ఆహారాలను ఎక్కువ సేపు వండడం మరణాన్ని ఆహ్వానించినట్లే.. 

ఇది కూడా చదవండి..ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..నాలుగేళ్ల బాలుడికి ప్ర‌పంచంలోనే అరుదైన వ్యాధి.. చికిత్స‌తో న‌యం చేసిన వైద్యులు..

 

 

అయితే ఇది తేలికగా తీసుకోదగిన విషయం కాదు. ప్రతి ఏడుగురిలో ఒకరు ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాత్కాలిక సమస్యల కంటే, ఇది తల్లి లేదా బిడ్డకు దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. అందుకే తేలిగ్గా తీసుకోకూడదని అంటున్నారు వైద్యనిపుణులు.

విచారం, పనికిరాని భావాలు, ఆందోళన, కోపం ఇవన్నీ ఇందులో భాగం కావచ్చు. కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్రసవానంతర డిప్రెషన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..?  


వ్యాయామం.. 

రెగ్యులర్ వ్యాయామం డిప్రెషన్‌తో పోరాడటానికి, మరింతగా పెరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఇది శిశువు ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్లు సెరోటోనిన్ , డోపమైన్ విడుదలవుతాయి. దీని ద్వారా డిప్రెషన్ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.

 కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ..  

ప్రసవానంతర డిప్రెషన్‌ను నిర్వహించడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సమర్థవంతమైన చికిత్స.  బాధిత వ్యక్తి  ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారో గుర్తించడానికి, మెరుగుపరచడానికి సహాయపడే చికిత్స ఇది. నేను తల్లిని కాలేను, మంచి పేరెంట్‌ను కాలేను అనే గందరగోళానికి గురయ్యే మహిళలు ఉంటారు. ఈ ఆలోచనలు ప్రెగ్నెన్సీ డిప్రెషన్‌లో భాగం. ఈ సమస్యలన్నింటినీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా పరిష్కరించవచ్చు.

మానసిక సమస్య. 

 మానసిక ఆరోగ్య సమస్యలలో అత్యంత ముఖ్యమైన విషయం ఖచ్చితమైన కమ్యూనికేషన్. ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్న మహిళలు తమ చుట్టూ ఉన్న వారితో బహిరంగంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలి. వారు చెప్పేది వినడానికి , వారి పట్ల శ్రద్ధ వహించడానికి ,ఇతరులను చూసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది వారి మానసిక పరిస్థితికి గొప్ప ఉపశమనం.


ఆహారం.. 

 గర్భధారణ సమయంలో ఆహారం చాలా ముఖ్యం. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు ప్రెగ్నెన్సీ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లయితే, మీరు ఖచ్చితంగా మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. ఆనందాన్ని కలిగించే  మీ మానసిక స్థితిని మార్చగల ఆహారాన్ని ఎంచుకోండి. అవసరమైతే దీని కోసం డైటీషియన్‌ను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : women-health mental-health depression mental-tensions women-health-problems pregnancy-time pregnant-women pregnant-women-health diet-and-depression depression-and-anxiety depression-and-exercise depression-treatment depression-diet-plan depression-diet

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com