గర్భధారణ సమయంలో అధిక బరువు కారణంగా తలెత్తే సమస్యలు..    

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో బరువు పెరగడం అనేది ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. గర్భధారణ సమయంలో బరువు ఎక్కువగా పెరిగితే అది తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి, గర్భధారణ సమయంలో బరువును నియంత్రించడం చాలా ప్రధానం. ఆ సమయంలో బరువును నియంత్రించడం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

గర్భధారణ అనేది స్త్రీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన, సున్నితమైన దశ. ఈ కాలంలో, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, వాటిలో బరువు పెరగడం కూడా సాధారణ విషయం. అయితే, అధిక బరువు పెరగడం వల్ల తల్లికే కాకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల గర్భధారణ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, సురక్షితమైన ప్రసవం ,శిశువు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో ఎంత బరువు పెరగడం సాధారణమో, ఏ స్థాయి తర్వాత అది ఆందోళన కలిగించే విషయంగా మారుతుందో తరచుగా మహిళలు అర్థం చేసుకోలేరు. అటువంటి పరిస్థితిలో కొంతమంది మహిళలు అధిక బరువు పెరుగుతారు. ఆ సమయంలో గర్భధారణ మధుమేహం, అధిక రక్తపోటు, సంక్లిష్టమైన ప్రసవం వంటి సమస్యలకు దారితీస్తుంది. అదే సమయంలో తక్కువ బరువు ఉండడం కూడా పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది.కాబట్టి గర్భధారణ సమయంలో సమతుల్య బరువును నిర్వహించడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు.   

 

ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?

ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.