ఐరన్ పెంచే ఆహారాలు ఇవిగో.. 

సాక్షి లైఫ్ : ఐరన్ (Iron) అనేది మన శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజం. ఇది ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ నిర్మాణానికి, అలాగే శరీరంలోని ఆక్సిజన్ ను సరఫరా చేయడంలోనూ, ముడి పోషకాలను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదుశారీరక శ్రమ చేసే వ్యక్తులకు కూడా ఐరన్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది.

ఇది కూడా చదవండి..అనస్థీషియా ఎన్ని రకాలు..?

ఇది కూడా చదవండి..ప్రపంచంలో ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారాలు..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

శరీరంలో ఐరన్ పాత్ర చాలా ఉంది. సరైన పనితీరుకు, పెరుగుదలకు అవసరమైన ఖనిజం ఇది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే శరీరం బలహీన పడుతుంది. అంతేకాదు శరీరంలో ఐరన్ లోపం తలెత్తుతుంది. ఐరన్ లోపం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. పిల్లలు, మహిళలు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం స్వయంగా  ఐరన్ ను ఉత్పత్తి చేయలేదు. మనం తినే ఆహారం ద్వారా ఐరన్ లభిస్తుంది. అందుకోసం ఎలాంటి ఆహారాలు తినాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

 ఖర్జూరం-ఎండుద్రాక్ష.. 

ఖర్జూరం ,ఎండుద్రాక్షలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ "ఏ", విటమిన్ "సి" పుష్కలంగా ఉన్నాయి. రోజూ రెండు లేదా మూడు ఖర్జూరాలు ,ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షలను అల్పాహారంగా తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి , ఐరన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

బీట్రూట్-క్యారెట్.. 

బీట్‌రూట్‌, క్యారెట్‌లో ఐరన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ జ్యూస్‌ రూపంలో రోజూ ఉదయం తాగవచ్చు. ఒక టీస్పూన్ నిమ్మరసం కూడా రసంలో చేర్చవచ్చు. నిమ్మరసంలో విటమిన్ "సి" పుష్కలంగా ఉంటుంది. తద్వారా వ్యాధినిరోధక శక్తి కూడా లభిస్తుంది. 
నల్ల నువ్వులు.. 

నల్ల నువ్వులలో ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, ఫోలేట్ వంటి అనేక విటమిన్లు ఉన్నాయి. నల్ల నువ్వులను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా శరీరానికి కావాల్సిన  ఇనుము లభిస్తుంది.

 

ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?

ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : women-health pregnant-women iron iron-test foods-high-in-iron foods-rich-in-iron iron-rich-foods food-rich-in-iron foods-with-iron iron-foods high-iron-foods iron-in-food top-10-foods-high-in-iron iron-rich-food top-foods-rich-in-iron what-foods-have-iron vegan-iron-rich-foods

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com