Iodine Deficiency : ఐయోడిన్ లోపంతో థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయా..?
సాక్షి లైఫ్ : శరీరానికి అత్యంత కీలకమైన ఖనిజాలలో ఐయోడిన్ (Iodine) ఒకటి. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసి, ముఖ్యమైన థైరాయిడ్ హార్మోన్లను (T3, T4) విడుదల చేయాలంటే, ఐయోడిన్ సరైన మోతాదులో అవసరమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రస్తుత తరంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల కారణంగా చాలామందిలో ఈ ఐయోడిన్ లోపం తలెత్తుతోంది. కాబట్టి దీనిని 'సైలెంట్ కిల్లర్' అని అంటారు, ఎందుకంటే ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు అంత త్వరగా కనిపించవు, కానీ కాలక్రమేణా తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
థైరాయిడ్ కు ఐయోడిన్ కు లింక్ ఏమిటి..?
థైరాయిడ్ హార్మోన్లు శరీరంలో జీవక్రియలను (Metabolism) నియంత్రిస్తాయి. శరీరంలోని శక్తి వినియోగం, ఉష్ణోగ్రత, కణాల అభివృద్ధి వంటి కీలక విధులు ఈ హార్మోన్లపై ఆధారపడి ఉంటాయి. ఐయోడిన్ లేకపోతే, థైరాయిడ్ గ్రంథికి తగినంత T3 అండ్ T4 హార్మోన్లను తయారు చేయడం సాధ్యం కాదు. ఐయోడిన్ లోపించినప్పుడు, థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయలేదు. ఈ పరిస్థితినే హైపోథైరాయిడిజం అంటారు.
ఐయోడిన్ లోపించినప్పుడు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే..?
శరీరంలో ఐయోడిన్ లోపించినప్పుడు లేదా హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..?
బరువు పెరగడం.. జీవక్రియ మందగించడం వల్ల వివరించలేని విధంగా బరువు పెరుగుతారు. తీవ్ర అలసటగా అనిపించడం... ఏ పని చేయకపోయినా, నీరసంగా, నిస్సత్తువగా అనిపించడం.
మానసిక సమస్యలు... తరచుగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ బారిన పడటం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం. శరీర మార్పులు..చర్మం పొడిబారడం, జుట్టు విపరీతంగా రాలడం, చలిని తట్టుకోలేకపోవడం. గాయిటర్ (Goiter)... థైరాయిడ్ హార్మోన్ల కొరతను భర్తీ చేయడానికి థైరాయిడ్ గ్రంథి ఉబ్బుతుంది, దీని వలన మెడ భాగంలో వాపు వస్తుంది దీనినే గాయిటర్ అంటారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
