Kajal : అందానికే కాదు, కంటి ఆరోగ్యానికి కాటుక రక్షే..!
సాక్షి లైఫ్ : మహిళల అందాన్ని ఇనుమడింపజేయడంలో కాటుక (Kajal) పాత్ర ప్రత్యేకమైనది. కళ్ళకు కాటుక దిద్దితే ఆకర్షణ పెరగడమే కాదు, సంప్రదాయపరంగా దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటారు. దృష్టిని మెరుగుపరచడం, కంటికి రక్షణ ఇవ్వడం వంటివి వాటిలో ప్రధానం.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
కాటుకతో కంటికి కలిగే ప్రయోజనాలు..
సంప్రదాయబద్ధంగా ఇంట్లో తయారుచేసిన కాటుకలో ఆముదం, నెయ్యి, కర్పూరం వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి కళ్ళకు చల్లదనాన్ని ఇచ్చి, కంప్యూటర్ స్క్రీన్‌లు లేదా అధిక కాంతి వల్ల కలిగే అలసటను తగ్గిస్తాయి. ఆముదం, బాదం నూనె వంటివి కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన చర్మాన్ని, రెప్పలను తేమగా ఉంచి పొడిబారకుండా కాపాడుతాయి.
సూక్ష్మక్రిములకు అడ్డుకట్ట..
కొన్ని సహజ కాటుకల్లో ఉండే మూలికలు యాంటీ బాక్టీరియల్ (Anti-bacterial) గుణాలను కలిగి ఉంటాయి. ఇవి దుమ్ము, ధూళి నుంచి వచ్చే చిన్నపాటి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయని నమ్ముతారు.
ఆధునిక కాటుకతో ముప్పు..
అయితే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కాటుక ఉత్పత్తుల్లో చాలావరకు రసాయనాలు (Chemicals) అధికంగా ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటివి వాడేముందు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
రసాయన కాటుకలో ఉండే లెడ్ (సీసం) వంటి పదార్థాలు కళ్ళ లోపలికి చేరి, దీర్ఘకాలంలో కళ్ళకు, శరీరానికి హాని కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కళ్ళు మంట పుట్టడం, ఎర్రబడటం లేదా అలర్జీలకు దారితీయవచ్చు.
దృష్టి మెరుగుపడటం అపోహే.. రసాయన కాటుకను రోజూ వాడటం వల్ల కంటి చూపు మెరుగవుతుందనేది వైద్యపరంగా రుజువు కాలేదు. పైగా, ఇది కనురెప్పల వెంట్రుకల నూనె గ్రంథులను మూసివేసి, కళ్ళను మరింత పొడిబారేలా చేసే అవకాశం ఉంది.
కాటుక వాడటం తప్పుకాదు, కానీ..
వీలైనంత వరకు ఇంట్లో తయారుచేసిన లేదా పూర్తి సేంద్రీయ (Organic), ఆయుర్వేదిక్ (Ayurvedic) కాటుక ఉత్పత్తులను మాత్రమే వాడాలి. ఎంత నాణ్యమైన కాటుక అయినా, రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే రసాయనాలు కంటికి హాని కలిగించే ప్రమాదం ఉంది. సురక్షితమైన కాటుకనే ఎంచుకోవాలి. కాటుక పెట్టుకునే పెన్సిల్ లేదా చేతి వేళ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి, లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, సంప్రదాయ ప్రయోజనాలను పొందాలంటే స్వచ్ఛమైన కాటుకను వాడుతూ, రసాయన ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
