సాక్షి లైఫ్ : భారతీయ మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) కేసులు, మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ధూమపానం చేయని మహిళల్లో కూడా ఈ మహమ్మారి ప్రాణాంతకంగా మారుతోంది. ఇందుకు గాలి కాలుష్యం (Air Pollution), అంతర్గత కాలుష్యంతో పాటు మహిళల ప్రత్యేక జన్యు (Genetic) కారకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఆందోళనకరమైన గణాంకాలు..
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(IARC) GLOBOCAN 2022 విశ్లేషణ ప్రకారం, 2022లో భారతదేశంలో 14.13 లక్షల మొత్తం క్యాన్సర్ కేసుల్లో 7.12 లక్షలు మహిళల్లోనే నమోదయ్యాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒక్కటే 81,748 కేసులకు కారణమైంది, 75,031 మరణాలకు దారితీసింది.
పురుషుల్లో సాధారణంగా 50-74 ఏళ్ల మధ్య కనిపించే ఈ వ్యాధి, భారతీయ మహిళల్లో అంతకంటే ముందుగానే, సగటున 45-69 ఏళ్ల మధ్యే దాడి చేస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనం తెలిపింది.
ఎక్కువ మరణాల రేటు..
మహిళల్లో స్థూల క్యాన్సర్ మరణాల రేటు (ప్రతి లక్ష మందికి 64.2) పురుషుల కంటే (ప్రతి లక్ష మందికి 62.2) ఎక్కువగా ఉంది.
మహిళల మరణాలకు కారణాలు ఏమిటంటే..?
1. విషపూరిత కాలుష్యం (Toxic Pollution)..
గాలి కాలుష్యం (Outdoor Pollution): భారతీయ నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం అంటే ముఖ్యంగా PM 2.5 వంటి సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోయి దీర్ఘకాలిక వాపునకు (Chronic Inflammation), DNA దెబ్బతినడానికి కారణమవుతోంది. ఇది క్యాన్సర్‌కు దారి తీస్తోంది.
ఇన్ డోర్ పొల్యూషన్ (Indoor Pollution)..
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వంట కోసం కట్టెలు, బొగ్గు లేదా పిడకలు వంటి ఘన ఇంధనాలను (Biomass Fuels) వాడటం వల్ల వచ్చే పొగ హానికరమైన కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. ఇంట్లో ఎక్కువ సమయం ఉండే మహిళలు ఈ పొగను పీల్చడం వలన క్యాన్సర్ ప్రమాదం విపరీతంగా పెరుగుతోంది.
సెకండ్‌హ్యాండ్ స్మోక్..
ధూమపానం చేసేవారి పక్కన ఉండటం వల్ల వచ్చే పొగ (పాసివ్ స్మోకింగ్) కూడా మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను పెంచుతోంది.
2. జన్యుపరమైన బలహీనతలు (Genetic Vulnerabilities) EGFR జన్యు మార్పులు..
ధూమపానం చేయని ఆసియా మహిళల్లో, ముఖ్యంగా భారతీయుల్లో EGFR (Epidermal Growth Factor Receptor) వంటి కొన్ని ప్రత్యేక జన్యు ఉత్పరివర్తనలు (Mutations) అధికంగా కనిపిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మార్పులు ధూమపానంతో వచ్చే క్యాన్సర్ల కంటే భిన్నంగా ఉంటాయి. పర్యావరణ కాలుష్య కారకాలకు గురైనప్పుడు ఈ జన్యు మార్పులు క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రేరేపించవచ్చు.
ఈస్ట్రోజెన్ ప్రభావం: మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ (Oestrogen) హార్మోన్ కూడా క్యాన్సర్ కణాల పెరుగుదలను వేగవంతం చేయగలదని, ఇది జన్యుపరమైన మార్గాలను ప్రభావితం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
3. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం..
ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా ధూమపానం చేసే పురుషులకే వస్తుందనే అపోహ కారణంగా, మహిళల్లో కనిపించే నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యాధి ముదిరి, చికిత్స కష్టమయ్యే దశలో (Advanced Stage) గుర్తించడం మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను అరికట్టడానికి, గాలి కాలుష్యాన్ని తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన ఇంధనాలను ప్రోత్సహించడం, ముఖ్యంగా ధూమపానం చేయని మహిళల్లో కూడా లక్షణాలు కనిపిస్తే తక్షణమే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Colorectal Cancer : పెద్ద పేగులో క్యాన్సర్ ను.. ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..లివర్ సెల్ డెత్ అంటే..? కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com