మహిళల్లో చిన్నవయసులోనే పీరియడ్స్ ఆగిపోవడానికి ప్రధాన కారణాలేంటి..?
సాక్షి లైఫ్ : పునరుత్పత్తి చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఈస్ట్రోజెన్. సాధారణంగా చిన్న వయసులోనే పీరియడ్స్ ఆగిపోవడాన్ని "ప్రీ-మెనోపాజ్" అంటారు. ఈ కాలంలో, మహిళలు గర్భవతి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రీ-మెనోపాజ్ సమస్య జీవనశైలి లో మార్పులు ,ఆహారపు అలవాట్లకు సంబంధించిన సమస్య అని గైనకాలజిస్టులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ముఖ్యంగా మహిళల్లో ప్రీ-మెనోపాజ్ రావడానికి చాలా కారణాలున్నాయి. 45 -55 సంవత్సరాల మధ్య వయస్సులో మహిళల అండాశయాలు గుడ్లు ఉత్పత్తి ఆగిపోతుంది. దీని కారణంగా ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి.
ప్రీ-మెనోపాజ్..
అండాశయాలలో శస్త్రచికిత్స, ఏదైనా వ్యాధికి ఇచ్చే రేడియేషన్, అతిగా మద్యం సేవించడం,ధూమపానం చేయడం, కీమోథెరపీ, వంశ పారంపర్యంగా కూడా ప్రీ-మెనోపాజ్ తలెత్తడానికి కారణాలుంటాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఇది కాకుండా, కొన్ని ఆటో ఇమ్యూన్ పరిస్థితులు లేదా ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్‌లు ఆడవారిలో సర్వసాధారణంగా ఉంటాయి. దీని కారణంగా పీరియడ్స్ సడెన్ గా ఆగిపోతాయి.
ప్రీ-మెనోపాజ్ లక్షణాలు..ఎలా ఉంటాయి..?
ప్రీ-మెనోపాజ్ సమయంలో మహిళలకు చిరాకు, యోనిలో దురద, రొమ్ములలో వాపు, అధిక వేడి, రొమ్ములలో తేలికపాటి నొప్పి, లైంగిక కోరికలు లేకపోవడం, మానసిక సమస్య, ఎక్కువగా చెమటలు పట్టడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అంతేకాదు పని చేయకపోయినా చేసినా ఎటువంటి కారణం లేకుండా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ లక్షణాలు మెనోపాజ్‌కు 6-7 నెలల ముందు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
