ICMR Warns : స్త్రీల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరగడానికి ఈ అలవాట్లే ప్రధాన కారణం : ఐసీఎంఆర్ హెచ్చరిక

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశంలో మహిళలను వేధిస్తున్న రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) మహమ్మారి ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఏటా రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య సుమారు 5.6 శాతం మేర పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..సంతానోత్పత్తిని పెంచడానికి ఎలాంటి ఫుడ్స్ తప్పనిసరి అంటే..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఫాలో-అప్ కేర్ అవసరం..

 

ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం క్యాన్సర్ ప్రమాద కారకాలు ఇవే.. 

ముఖ్యంగా పొత్తికడుపు వద్ద కొవ్వు ఎక్కువగా ఉండటం (Abdominal Obesity) రొమ్ము క్యాన్సర్ ముప్పును రెట్టింపు చేస్తోంది. మాంసాహారం అధికంగా తీసుకోవడం, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగి క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. సరైన సమయానికి నిద్రపోకపోవడం, వెలుతురు ఉన్న గదుల్లో పడుకోవడం వల్ల 'మెలటోనిన్' హార్మోన్ ఉత్పత్తి తగ్గి, క్యాన్సర్ కణాల వృద్ధికి కారణమవుతోంది. 50 ఏళ్లు దాటిన తర్వాత మెనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో ఈ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

 ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత సంతానం కలగడం, రెండు కంటే ఎక్కువసార్లు అబార్షన్లు చేయించుకోవడం కూడా రిస్క్ ఫ్యాక్టర్లుగా మారుతున్నాయి. 2022లో భారతదేశంలో కొత్తగా 2,21,757 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇది మహిళల్లో వచ్చే మొత్తం క్యాన్సర్లలో సుమారు 22.8 శాతానికి సమానం.

మరి ఏమిటి పరిష్కారం..?

 శారీరక శ్రమను పెంచుకోవడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ ముప్పును చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే, 40 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు (Mammogram) చేయించుకోవడం ఉత్తమం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..పీసీఓడీ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.