మహిళల్లో విటమిన్ "డి" లోపం తలెత్తినప్పుడు కనిపించే లక్షణాలు..
సాక్షి లైఫ్ : మహిళల్లో విటమిన్ "డి" లోపం అనేది ఇటీవల మరింతగా పెరుగుతోంది. దీని లోపం కారణంగా ఎముకలు, కండరాలు, రోగనిరోధక వ్యవస్థ బలహీనతకు దారితీస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సూర్యకాంతి లభించకపోవడం దీనికి ప్రధాన కారణం. ఇటీవల చైనాలో ఒక మహిళ విటమిన్ "డి" లోపం కారణంగా ఎముక విరిగిపోయిన సంఘటన జరిగింది. ఈ ఘటన విటమిన్ "డి" లోపం ప్రభావాన్ని మనకు బాగా తెలియజేస్తోంది.
ఇది కూడా చదవండి..ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి..? ఎలాంటి మహిళల్లో వస్తుంది..?
ఇది కూడా చదవండి..Thyroid problems : థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
విటమిన్-డి లోపం లక్షణాలు ఎలా వుంటాయంటే..?
శరీరంలో అలసట, బలహీనత
ఎముకలు, కీళ్ల నొప్పి
కండరాల బలహీనత
రోగనిరోధక శక్తి తక్కువవడం
జుట్టు రాలడం
గాయాలు నెమ్మదిగా మానడం
మానసిక స్థితిలో మార్పులు, డిప్రెషన్
విటమిన్ "డి" లోపం వల్ల వచ్చే సమస్యలు..
విటమిన్ డి లోపం ఎముకల బలహీనతకు దారితీస్తుంది. దీని కారణంగా పెద్దలలో ఆస్టియోపోరోసిస్, పిల్లల్లో రికెట్స్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువవడంతో సులభంగా జబ్బులు వచ్చే అవకాశమూ ఉంది. కండరాల నొప్పులు, బలహీనత, అలాగే మానసిక ఆరోగ్యంలోనూ మార్పులు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
