మధుమేహం ఉన్న మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత బిజీ జీవితంలో, సరైన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా, ప్రజలలో అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయి. మధుమేహం కూడా వాటిలో ఒకటి. మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఏమాత్రం విస్మరించకూడదని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

 

మధుమేహం లక్షణాలు..? 

మధుమేహం వచ్చినప్పుడు, శరీరంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. దీని కారణంగా, అనేక రకాల వ్యాధులు వారిని చుట్టుముడతాయి. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోంది. మధుమేహం పురుషులు, మహిళలు ఇద్దరికీ సంభవిస్తుంది. కానీ ఆయా లక్షణాలు ముఖ్యంగా మహిళల్లో వేరేలా కనిపిస్తాయి.

 మహిళలు అలసట, తరచుగా ఇన్ఫెక్షన్లు లేదా బరువు పెరగడం వంటి సమస్యలను సాధారణ సమస్యలుగా పరిగణించి విస్మరిస్తారు, కానీ ఈ లక్షణాలు మధుమేహం ప్రారంభ సంకేతాలు కూడా కావచ్చు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే, ఈ వ్యాధి నెమ్మదిగా శరీరాన్ని లోపలి నుంచి దెబ్బతీస్తుంది.

మహిళల్లో మధుమేహం లక్షణాలు పురుషుల్లో కనిపించిన విధంగా ఉండవు, వేరేలా కనిపిస్తాయి. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ సంకేతాలు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి అసమతుల్యమవుతున్నాయని సూచిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో మాత్రమే కనిపించే మధుమేహ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


 స్త్రీలలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.. 

కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొన్ని సార్లు పీరియడ్స్ ఆలస్యంగా రావడం లేదా సమయానికి ముందే ప్రారంభమవడం జరుగుతుంది.

దీనితో పాటు, స్త్రీల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, పురుషులతో పోలిస్తే లక్షణాలు మరోలా కనిపిస్తాయి. డయాబెటీస్ ఈస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అదే సమయంలో చర్మం ఎర్రగా మారడం, చర్మంపై దురద రావడం జరుగుతుంది.

మహిళలకు డయాబెటిస్ ఉన్నప్పుడు, రక్తంలో అధిక చక్కెర కారణంగా, యోనిలో పొడిబారడం కూడా జరుగుతుంది. ఇది కూడా డయాబెటిస్ లక్షణం.

దీనితో పాటు, అధిక రక్తంలో చక్కెర స్థాయి కూడా మహిళల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా, చేతులు, కాళ్ళలో జలదరింపు సమస్య తలెత్తుతుంది. దీనిని విస్మరించడం వల్ల సమస్య పెరుగుతుంది.

మధుమేహం సాధారణ లక్షణాలు..  

గాయాలు నయం కావడంలో ఆలస్యం.. 

 ఆకలిఎక్కువగా అనిపించడం..  

తరచుగా దాహం వేయడం.. 

వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం.. 

అలసట, బలహీనంగా అనిపించడం.. 

 

ఇది కూడా చదవండి.. మ‌తిమ‌రుపునకు చికిత్స సాధ్య‌మేనా..?

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.