శానిటరీ ప్యాడ్స్ కు క్యాన్సర్ కు లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : శానిటరీ ప్యాడ్స్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు, నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, దీనిపై ఖచ్చితమైన శాస్త్రీయ నిర్ధారణ ఇంకా జరగాల్సి ఉంది. మార్కెట్లో లభించే అనేక శానిటరీ ప్యాడ్ల తయారీలో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు వంటి హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని, ఈ రసాయనాలు ఎక్కువ కాలం పాటు ప్యాడ్లు చెక్కుచెదరకుండా ఉండటానికి ఉపయోగిస్తారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ప్రమాదం మరింతగా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..?
ఇది కూడా చదవండి.. ఆర్గానిక్ ఫ్రూట్స్ ను గుర్తించాలంటే ఏమిచేయాలి.. ?
ప్రస్తుతం మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్నిరకాల రకాల శానిటరీ ప్యాడ్ల తయారీలో ఎక్కువగా థాలేట్స్, కర్బన సమ్మేళనాలు వొలాటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ వంటి విషపూరితమైన కెమికల్స్ ను వినియోగిస్తున్నారు. ఎక్కువరోజులు చెక్కుచెదరకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పలు శానిటరీ ప్యాడ్స్ తయారీ సంస్థలు థాలేట్స్ ను మిక్స్ చేస్తున్నాయి. థాలేట్స్ యుక్తవయస్సులో శరీరంలో మార్పులను ప్రేరేపిస్తాయి.
అంతేకాదు వీటి కారణంగా క్యాన్సర్, సంతానోత్పత్తి విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) చెబుతోంది. మరోపక్క శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని, కానీ కొన్నిసార్లు ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే నెలసరి సమయంలో మెన్ట్రువల్ కప్స్ వినియోగించమని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
గత 40 ఏళ్ల క్రితం చాలా మంది మెత్తటి చీరలను లేదా పంచలను ఇందుకోసం ఉపయోగించేవాళ్లు. అవి కూడా ఎక్కువ కాలం వాడకూడదు. ఎందుకంటే బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్స్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. పలు ఎంజీవో సంస్థలు క్లాత్ తో తయారు చేసిన శానిటరీ నాప్కిన్స్‌ను అందిస్తున్నాయి. అటువంటివాటివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. స్మోకింగ్ అలవాటు లేనివారు లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
