ఉమెన్ హెల్త్ కేర్ : గర్భిణిగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా కొంత పెయిన్‌ ఉండటం చాలామందిలో చూస్తుంటాం.పెయిన్‌ టైప్, తీవ్రతను బట్టి పెయిన్‌ స్కేల్‌ అసెస్‌మెంట్‌తో నొప్పిని తగ్గించే మందులు,వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ లేదా కౌన్సెలింగ్‌ సూచిస్తారు. అయితే వీటన్నిటికీ నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. NSAIDS డ్రగ్‌ ఫ్యామిలీకి సంబంధించిన Brufen, Naproxen, Diclofenac లాంటివి ప్రెగ్నెన్సీ సమయంలో అస్సలు వాడకూడదని గైనకాలజిస్ట్‌ లు చెబుతున్నారు.   

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది..? అంతేకాదు ఆ సమయంలో వారు పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవద్దంటారు. నిజమేనా..? ఒకవేళ జ్వరం లాంటివి వచ్చినా డోలో వంటి మందులు వేసుకుంటే ఏమైనా ప్రమాదమా..?

ముఖ్యంగా ఏడు నుంచి తొమ్మిది నెలల్లో. పారాసిటమాల్‌(డోలో, కాల్‌పాల్, క్రోసిన్‌) లాంటివి వాడవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు నుంచి ఓ మోస్తరు పెయిన్‌ ఉన్నప్పుడు డీప్‌ బ్రీతింగ్‌ టెక్నిక్స్, వేడి, ఐస్‌ కాపడాలు వంటివి సూచిస్తారని ఆమె వెల్లడిస్తున్నారు. 

పారాసిటమాల్‌ని వాడవచ్చు. 30 వారాలు దాటిన తర్వాత ఎలాంటి పెయిన్‌ కిల్లర్స్‌ని వాడకపోవడమే మంచిది. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే Opiates పెయిన్‌ కిల్లర్స్‌ అంటే  Morphine, Tramadol లాంటివి సూచిస్తామని డా. భావన తెలిపారు.

"లేబర్‌ పెయిన్‌ని కూడా కొంతవరకు ఉపశమనాన్నిస్తాయి. అయితే ఇవి కేవలం డాక్టర్‌ అందించిన ప్రిస్క్రిప్షన్‌ ద్వారానే వాడాలి. కొంతమంది గర్భిణీలకు నర్వ్‌ పెయిన్‌ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పారాసిటమాల్‌ని ఇస్తారు. గర్భిణీ.. నిపుణల పర్యవేక్షణ, పరిశీలనలో ఉండాలి." 

"కొందరికి Amitriptyline లాంటి మందులను కొన్ని రోజులపాటు ఇస్తారు. పారాసిటమాల్‌ ఒళ్లు నొప్పులను, జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భిణీలకు పారాసిటమాల్‌ సురక్షితమైందని చాలా అధ్యయనాల్లో వెల్లడైందని  గైనకాలజిస్ట్‌ లు చెబుతున్నారు.   

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.