Cervical Cancer : అసాధారణ రక్తస్రావం కేవలం నెలసరి సమస్యే కాకపోవచ్చు..ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మహిళల హార్మోన్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల చాలామందిలో నెలసరి (Periods) సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తస్రావం (bleeding) మరీ ఎక్కువగా లేదా తక్కువగా కావడం, మధ్యలో స్పాటింగ్ లాంటివి సర్వసాధారణం అయిపోయాయి. హార్మోన్లలో మార్పులే కాకుండా ఒత్తిడి, థైరాయిడ్, గర్భాశయ సమస్యల stress (thyroid issues, or uterine problems)వల్ల కూడా ఇలా జరగవచ్చు.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

అయితే, అసాధారణంగా జరిగే ప్రతి రక్తస్రావాన్నీ(menstrual issue) కేవలం 'నెలసరి సమస్య' గానే భావించి వదిలేయడం ఏమాత్రం సరికాదు. కొన్ని సందర్భాల్లో ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు (warning sign of cervical cancer) ప్రాథమిక సంకేతం కావచ్చు. అసాధారణ బ్లీడింగ్‌ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాలి..?

గర్భాశయ క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నెలసరి సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా రక్తస్రావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కింది లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. రెండు నెలసరుల మధ్యలో అకస్మాత్తుగా రక్తస్రావం లేదా పదేపదే స్పాటింగ్ కావడం. భార్యాభర్తలు కలయికలో పాల్గొన్న తర్వాత (Post-coital bleeding) రక్తస్రావం జరగడం.

మెనోపాజ్ (menopause)వయసు పైబడి నెలసరి శాశ్వతంగా ఆగిపోయిన దశ తర్వాత కూడా బ్లీడింగ్ కావడం. నెలసరిలో రక్తస్రావం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉండటం లేదా ఎక్కువ రోజుల పాటు కొనసాగడం.

బ్లీడింగ్‌కు ఇతర కారణాలు ఏమై ఉండొచ్చు..?

అసాధారణ బ్లీడింగ్ కనిపించిన ప్రతిసారీ అది క్యాన్సరే అని భయపడాల్సిన అవసరం లేదు. దీనికి అనేక ఇతర సాధారణ, చికిత్సతో నయమయ్యే కారణాలు కూడా ఉండవచ్చు.హార్మోన్లలో హెచ్చుతగ్గులు లేదా గర్భనిరోధక మాత్రల వాడకం. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ (Tumors) లేదా పాలిప్స్ ఏర్పడటం. ఇన్ఫెక్షన్లు లేదా యోని భాగం విపరీతంగా పొడిబారడం. థైరాయిడ్ సమస్యలు లేదా గర్భధారణకు సంబంధించిన ఇబ్బందులు.

క్యాన్సర్‌తో బ్లీడింగ్ ఎందుకు వస్తుంది..?

సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ కింది భాగం (cervix) కణాలలో అసాధారణ మార్పులు జరగడం. కణజాలంలో క్యాన్సర్ మార్పులు చోటుచేసుకున్నప్పుడు ఆ ప్రాంతం అత్యంత సున్నితంగా మారుతుంది. అందుకే శృంగారం తర్వాత లేదా నెలసరుల మధ్యలో సులభంగా రక్తస్రావం జరుగుతుంది.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?

పై లక్షణాలలో ఏవి కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి సులభంగా బయటపడవచ్చు. వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు పెల్విక్ ఎగ్జామ్, హెచ్‌పీవీ (HPV) టెస్ట్, ప్యాప్ స్మియర్ (Pap smear) లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటివి సూచిస్తారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా.. మహిళలందరూ నిర్ణీత వయసు వచ్చిన తర్వాత వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.