మధుమేహం ఉన్నప్పుడు చర్మంపై కనిపించే 5 ముఖ్యమైన లక్షణాలు..
సాక్షి లైఫ్ : ప్రస్తుతం మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తున్నది. ఇది ముఖ్యంగా క్లోమం దీనినే ప్యాంక్రియాస్ అని కూడా అంటారు. ఇది ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి సరైన పరిమాణంలో చేయలేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. తద్వారా ఈ సమస్య తలెత్తుతుంది. దీని ప్రభావం శరీరంలోని అనేక అవయవాలను, ముఖ్యంగా చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
మధుమేహం ఉన్న వ్యక్తులలో చర్మంపై కనిపించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ వ్యాధిని గుర్తించడంలో అవి సహాయపడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
మెడ చర్మం నల్లగా మారడం..
మధుమేహం ఉన్న వారికి మెడ ప్రాంతం చర్మం నల్లగా మారడం ఒక సాధారణ లక్షణం. ఇది అకాంథోసిస్ నైగ్రికన్స్ అనే పరిస్థితి ద్వారా కలుగుతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు సంకేతం.
చర్మంపై బొబ్బలు..
చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు, చర్మంపై చిన్న బొబ్బలు ఏర్పడవచ్చు. ఇవి సాధారణంగా పాదాలు, చేతులపై కనిపిస్తాయి.
గాయాలు ఆలస్యంగా మానడం..
మధుమేహం ఉన్నవారిలో చిన్న గాయాలు కూడా మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. అధిక చక్కెర స్థాయిలు రక్తప్రవాహాన్ని తగ్గించి, గాయాలను నయం చేయడానికి అవసరమైన పోషకాలను అందుకునే దారిని నిరోధిస్తాయి. దీనికారణంగా గాయాలు తొందరగా మానవు.
చర్మం దురద..
మధుమేహం వల్ల చర్మం పొడిబారి, దురదగా అనిపిస్తుంది. దురద ఒక నిర్దిష్ట ప్రాంతంలో కూడా సంభవించవచ్చు.
కళ్ళ కింద వాపు..
డయాబెటిస్ ఉన్నవారిలో కళ్ళ కింద వాపు కూడా ఒక సాధారణ సమస్య. ఈ వాపు మూత్రపిండాల సమస్యలకు సంకేతం కావచ్చు, ఇది చర్మంపై మధుమేహ లక్షణాలలో ఒకటి.మీరు చర్మంపై ఈ మార్పులను గమనిస్తే, దయచేసి వెంటనే డాక్టర్ ను సంప్రదించి, మధుమేహ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
