Budget 2026: మెడికల్ టూరిజానికి ‘మహర్దశ’.. దేశవ్యాప్తంగా 5 మెడికల్ హబ్స్..!
సాక్షి లైఫ్ : విదేశీయులకు అత్యాధునిక చికిత్సలను అందిస్తూ భారత్‌ను గ్లోబల్ హెల్త్‌కేర్ డెస్టినేషన్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'మెడికల్ వాల్యూ టూరిజం' (MVT) కోసం భారీ ఊతమిచ్చారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఫాలో-అప్ కేర్ అవసరం..
ఇది కూడా చదవండి..పీసీఓడీ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
మెడికల్ టూరిజం అంటే ఏమిటి..?
ఒక దేశానికి చెందిన ప్రజలు మెరుగైన వైద్య సదుపాయాల కోసం లేదా తక్కువ ఖర్చుతో కూడిన శస్త్రచికిత్సల కోసం వేరే దేశానికి వెళ్లడాన్నే 'మెడికల్ టూరిజం' అంటారు. భారత్‌లో అత్యాధునిక సాంకేతికతతో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటం, ఇతర దేశాలతో పోలిస్తే ఖర్చు తక్కువ కావడంతో విదేశీ రోగులు మన దేశానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలు, ముఖ్యాంశాలు..
ప్రతిపాదిత 5 మెడికల్ హబ్‌లు కేవలం ఆసుపత్రులుగా మాత్రమే కాకుండా.. పరిశోధన, విద్య, వ్యాధి నిర్ధారణ, పునరావాస (Rehabilitation) కేంద్రాలుగా పనిచేస్తాయి. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం, యోగా పట్ల ఆసక్తి పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ హబ్‌లలో ప్రత్యేక 'ఆయుష్ కేంద్రాలను' ఏర్పాటు చేస్తారు.
ఆయుర్వేదంలో నాణ్యమైన చికిత్సలు అందించేందుకు దేశంలో మూడు కొత్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) సంస్థలను నెలకొల్పుతారు. ఈ మెడికల్ హబ్‌ల ద్వారా లక్షలాది మంది వైద్యులు, నర్సులు, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ (AHP)లకు ఉపాధి లభించనుంది.
అంతర్జాతీయ వేదికపై ఆయుర్వేదం..
ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లే, ప్రస్తుతం ఆయుర్వేద ఉత్పత్తులకు విదేశాల్లో విపరీతమైన గిరాకీ ఏర్పడింది" అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీనివల్ల మూలికలు పండించే రైతులకు, ప్రాసెసింగ్ చేసే యువతకు భారీగా లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్‌ను కూడా మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ మెడికల్ హబ్‌ల ఏర్పాటు ద్వారా విదేశీ మారక ద్రవ్యం పెరగడమే కాకుండా, మన దేశంలోని టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..సంతానోత్పత్తిని పెంచడానికి ఎలాంటి ఫుడ్స్ తప్పనిసరి అంటే..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
