Trump Rx Plan : ట్రంప్ ఆర్.ఎక్స్ తో తగ్గింపు ధరలకే ఔషధాలు.. సామాన్యుడికి ఊరట..

షేర్ చేయండి:
Trump Rx Plan : ట్రంప్ ఆర్.ఎక్స్ తో తగ్గింపు ధరలకే ఔషధాలు.. సామాన్యుడికి ఊరట..

సాక్షి లైఫ్ : అమెరికాలో ఆకాశాన్నంటుతున్న మందుల ధరలకు చెక్ పెట్టేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' (MFN) విధానం ఆధారంగా రూపొందించిన 'ట్రంప్ ఆర్.ఎక్స్' పోర్టల్ ద్వారా 40కి పైగా అత్యవసర ఔషధాలను భారీ తగ్గింపు ధరలకే అందించనున్నారు. ముఖ్యంగా బీమా (Insurance) లేని వారికి, నగదు రూపంలో మందులు కొనే వారికి ఇది పెద్ద వరమని నిపుణులు అభివర్ణిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

ఏ మందులపై ఎంత తగ్గింపు అంటే..?

ఈ కొత్త పోర్టల్ ద్వారా డయాబెటిస్, బరువు తగ్గడం, ఇన్ ఫెర్టిలిటీ (సంతానలేమి) వంటి సమస్యలకు వాడే ఖరీదైన మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి:

ఒజెంపిక్ (Ozempic)..గతంలో దీని ధర నెలకు దాదాపు రూ.1,000 డాలర్లు అంటే సుమారు రూ.84,000 ఉండగా, ఇప్పుడు రూ.350 డాలర్లు అంటే సుమారు రూ.29,000 కే లభించనుంది.

వెగోవీ (Wegovy): బరువు తగ్గడానికి వాడే ఈ ఇంజెక్షన్ ధర రూ.1,350 డాలర్ల నుంచి199 డాలర్ల 349 డాలర్ల వరకు దిగిరానుంది.

ఇన్సులిన్: మధుమేహ రోగులకు ప్రాణాధారమైన ఇన్సులిన్ నెలకు కేవలం 25డాలర్ల నుంచి 35 డాలర్ల లకే అందుబాటులో ఉంటుంది.

సంతానలేమి మందులు..మహిళలు వాడే 'గోనాల్-ఎఫ్' వంటి మందుల ధరపై ఏకంగా 83శాతం వరకు రాయితీ ప్రకటించారు.

ఇది ఎలా పనిచేస్తుంది..?

'ట్రంప్ ఆర్.ఎక్స్' అనేది నేరుగా మందులు అమ్మే దుకాణం కాదు. ఇదొక సేవా పోర్టల్ (Aggregator) లా పనిచేస్తుంది. వినియోగదారులు TrumpRx.gov వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమకు కావాల్సిన మందులను సెర్చ్ చేయాలి. అక్కడ లభించే డిస్కౌంట్ కూపన్లను లేదా మ్యానుఫ్యాక్చరర్ లింకులను ఉపయోగించి తక్కువ ధరకు మందులు పొందవచ్చు. బీమా లేని వారు లేదా అధిక డిడక్టబుల్స్ ఉన్న వారికి ఇది అత్యంత లాభదాయకం.

నిపుణులు ఏమంటున్నారు అంటే..?
 
ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వినియోగదారులు కొన్ని విషయాలను గమనించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ తగ్గింపులు కేవలం నగదు చెల్లించే వారికి (Cash-paying patients) మాత్రమే వర్తిస్తాయి. బీమా వాడే వారికి ఈ ధరలు వర్తించకపోవచ్చు.

ఈ పోర్టల్ ద్వారా మందులు కొంటే, ఆ ఖర్చు మీ ఇన్సూరెన్స్ డెడక్టబుల్ కింద లెక్కించరు. జెనరిక్ మందులు.. బ్రాండెడ్ మందులపై భారీ తగ్గింపు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు జెనరిక్ మందులు ఇంకా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అమెరికన్లు మందుల కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. ఇతర దేశాలతో సమానంగా ధరలను తగ్గించడం వల్ల సామాన్యుల జేబుకు భారం తగ్గుతుంది. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.