అమెరికాలో COVID కొత్త వేరియంట్ NB.1.8.1.. 

షేర్ చేయండి:
అమెరికాలో COVID కొత్త వేరియంట్ NB.1.8.1.. 

సాక్షి లైఫ్ : ప్రపంచాన్ని మళ్లీ కోవిడ్‌ భయం ఆవహిస్తోంది. అమెరికాలోని ప్రముఖ విమానాశ్రయాల్లో NB.1.8.1 అనే కొత్త కరోనా వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్‌ కాలిఫోర్నియా, వాషింగ్టన్, వర్జీనియా, న్యూయార్క్ నగరం పరిధిలో ఉన్న విమానాశ్రయాల్లోని ప్రయాణికుల్లో వచ్చిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) వెల్లడించింది. 

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?

 

జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, చైనా తదితర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులలోనూ NB.1.8.1 అనే వేరియంట్ గుర్తించారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకూ పరీక్షలు నిర్వహించగా, మొదటగా కొన్ని కేసులు మార్చి చివరలోనే కనిపించినట్టు సమాచారం.

NB.1.8.1 లక్షణాలు.. న్యూ వేరియంట్ వ్యాప్తి, తీవ్రత..? 

ప్రాథమిక అధ్యయనాల ప్రకారం NB.1.8.1 వేరియంట్ ఇతర వేరియంట్‌లతో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వేరియంట్ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులకు దారి తీసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇది JN.1 వేరియంట్ కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. ఇప్పటికే ఉన్న టీకాలు కొంత మేరకు ఈ వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేయగలవని అంచనావేస్తున్నారు పరిశోధకులు.

 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.