Nipah Virus: నిఫా వైరస్ పై ఇండియా హై అలర్ట్.. విదేశాల్లో, విమానాశ్రయాల్లో స్క్రీనింగ్..
సాక్షి లైఫ్ : పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపిన ప్రాణాంతక 'నిఫా' వైరస్ వ్యాప్తిని విజయవంతంగా అరికట్టామని భారత ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని, పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని స్పష్టం చేసింది. అయితే, భారత్‌లో నిఫా వెలుగుచూడటంతో అప్రమత్తమైన పలు ఆసియా దేశాలు మన దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెంచాయి.
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఆందోళన వద్దు..!
పశ్చిమ బెంగాల్‌లోని బారాసత్‌లో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు నిఫా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ (NCDC) ధ్రువీకరించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన వైద్య బృందాలు..
బాధితులతో కాంటాక్ట్ అయిన 196 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించాయి.
వీరిలో ఎవరికీ నిఫావైరస్ లక్షణాలు లేకపోవడంతో పాటు, అందరి రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చాయని కేంద్రం వెల్లడించింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని, కొత్తగా ఎక్కడా కేసులు నమోదు కాలేదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
విదేశాల్లో హై అలర్ట్.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్..
భారత్‌లో నిఫావైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ, పొరుగు దేశాలు మాత్రం అప్రమత్తమయ్యాయి. థాయిలాండ్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్ వంటి దేశాలు భారత ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
థాయిలాండ్ , పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే విమానాల కోసం ప్రత్యేక పార్కింగ్ బేలను కేటాయించి, ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తోంది.
సింగపూర్ విమానాశ్రయాల్లో ప్రత్యేక తనిఖీలతో పాటు, ప్రయాణికుల ఆరోగ్య వివరాలను సేకరిస్తోంది.
పాకిస్థాన్, నేపాల్ సరిహద్దుల వద్ద 21 రోజుల ట్రావెల్ హిస్టరీని తనిఖీ చేస్తూ, ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు తప్పనిసరి చేశాయి.
ఏమిటీ నిఫా..? ఎందుకు ఇంత భయం..?
నిఫా వైరస్ గాలి ద్వారా కాకుండా, సోకిన జంతువులు ముఖ్యంగా గబ్బిలాలు, పందులు విసర్జితాల ద్వారా లేదా అపరిశుభ్రమైన పండ్ల ద్వారా వ్యాపిస్తుంది. దీని మరణాల రేటు 40 నుంచి 75 శాతం వరకు ఉండటం, దీనికి ఇంకా అధికారిక టీకా లేకపోవడం వల్ల అంతర్జాతీయ సమాజం ఈ వైరస్‌ను అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తోంది. పక్షులు లేదా జంతువులు కొరికిన పండ్లను తినకూడదని, తాటి కల్లు వంటి పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
