రతన్ టాటా కన్నుమూత.. 

షేర్ చేయండి:
రతన్ టాటా కన్నుమూత.. 

సాక్షి లైఫ్ : భారతదేశంలోనే అతిపెద్ద వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ పద్మవిభూషణ్ రతన్ టాటా (86) కన్నుమూశారు. రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో కన్నుమూశారు. రతన్ టాటా మరణ వార్త తెలియగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి చేరుకున్నారు.

ఇది కూడా చదవండి.. మానసిక ఆరోగ్యానికి, నిద్ర లేమికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి.. రోగనిరోధక శక్తిని అందించే అల్పాహారం..

ఇది కూడా చదవండి.. నిద్ర నాణ్యతను మెరుగుపరిచే చిట్కాలు..

సోమవారం రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి, అప్పుడు రతన్ టాటా స్వయంగా ఈ వార్తలను ఖండించారు. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన ఆరోగ్యం బాగానే ఉందని, తన గురించి వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు.  

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ప్రముఖులు రతన్ టాటా మృతికి సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

ఇది కూడా చదవండి.. నిద్ర మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? 

ఇది కూడా చదవండి.. మానసిక ఆరోగ్యానికి, నిద్ర లేమికి లింక్ ఏంటి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.