Super Flu Scaring America : అమెరికాను వణికిస్తున్న ‘సూపర్ ఫ్లూ’.. భయంకరమైన వైరస్..?
సాక్షి లైఫ్ : అమెరికాలో ప్రస్తుతం ఓ కొత్త వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. అక్కడి ప్రజలను ‘సూపర్ ఫ్లూ’గా భావిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా-A (H3N2) సబ్‌క్లేడ్-K వైరస్ వణికిస్తోంది. వైరస్ పై ఆరోగ్య నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఇన్‌ఫ్లుయెంజా-A (H3N2) సబ్‌క్లేడ్-K వైరస్ కారణంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..పీసీఓడీ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ప్రస్తుతం అమెరికాలో విజృంభిస్తున్న ఈ వైరస్‌ను వైద్య భాషలో ఇన్‌ఫ్లుయెంజా-A, (H3N2) ,సబ్‌క్లేడ్-K అని పిలుస్తున్నారు. ఇది సాధారణ ఫ్లూ వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతూ, బాధితులను తీవ్ర అస్వస్థతకు గురిచేస్తోంది. అందుకే దీనికి 'సూపర్ ఫ్లూ' అనే పేరు వచ్చింది.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఫ్లూ వ్యాక్సిన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. మాస్క్ ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తతే రక్షణఅని ఫ్లూ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..సంతానోత్పత్తిని పెంచడానికి ఎలాంటి ఫుడ్స్ తప్పనిసరి అంటే..?
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
