Toxic air : విషపు గాలి ఢిల్లీ గర్భిణులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..?  

సాక్షి లైఫ్ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి తరువాత వాయు నాణ్యత (Air Quality) మరింత క్షీణించి 'విషపు గాలి' (Toxic Air) వాతావరణాన్ని సృష్టిస్తోంది. దీంతో, గర్భిణీ స్త్రీలు, శిశువులు అత్యంత ప్రమాదంలో ఉన్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన కాలుష్య స్థాయిల కారణంగా.. గర్భిణులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది నెలలు నిండకముందే ప్రసవాలు (Pre-term Deliveries), తక్కువ బరువుతో శిశువులు జన్మించడానికి దారితీసే అవకాశం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి..

గర్భంతో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం సాధారణంగానే కాస్త కష్టంగా ఉంటుంది. అయితే, దీపావళి తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారిందని, గాలి నాణ్యత 'సాధారణం' నుంచి 'చాలా అధ్వానం' (Poor to Very Poor) మధ్య ఉంటుందని గర్భిణీ చెబుతున్నారు. తన బిడ్డపై కాలుష్య ప్రభావం పడుతుందేమోనని ఆందోళన చెందుతున్న ఆమె.. ప్రసవం అయిన వెంటనే ఉత్తరాఖండ్‌లోని తన స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొందరు గర్భిణులు అయితే ఢిల్లీని పూర్తిగా వదిలివెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు.

గర్భిణుల్లో అనారోగ్య సమస్యలు..

ఢిల్లీలోని గైనకాలజిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ మధ్య కాలంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, రక్తపోటు పెరగడం వంటి లక్షణాలతో వచ్చే గర్భిణుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

అకాల ప్రసవాలు.. కాలుష్యం వల్ల గర్భిణుల్లో ఆస్తమా, అలర్జీలు పెరగడంతో పాటు రక్తపోటు పెరిగి నెలలు నిండకముందే ప్రసవమయ్యే అవకాశం ఉంది. రోజుకు 20 మంది రోగులను చూస్తే అందులో సగం మంది ఇటువంటి సమస్యలతోనే వస్తున్నారని డాక్టర్లు అంటున్నారు.

శిశువుకు ఆక్సిజన్ కొరత.. గర్భిణులకు సాధారణంగానే ఎక్కువ ఆక్సిజన్ అవసరం. కాలుష్యం సమయంలో వారు మరింత వేగంగా, లోతుగా శ్వాస తీసుకుంటారు. అయితే, గాలిలోని పీఎం 2.5, పీఎం 10 వంటి విష కణాలు రక్తప్రవాహం ద్వారా ప్లాసెంటా (మావి)లోకి చేరి, బిడ్డకు అందాల్సిన ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

ఇతర ముప్పులు.. 

 ఆక్సిజన్ కొరత కారణంగా ప్లాసెంటా వేరుపడటం, శిశువు కడుపులోనే మరణించడం (Stillbirths), తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటి తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు భవిష్యత్తులో మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.

నివారణ ఒక్కటే మార్గం..

ఈ విష వాతావరణం నుంచి గర్భిణులు, శిశువులను రక్షించుకోవడానికి.. బయటకు వెళ్లకపోవడం, కిటికీలు గట్టిగా మూసి ఉంచడం, ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించడం, అత్యవసరమైతే తప్ప ఆన్‌లైన్ సంప్రదింపులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 ఈ సమస్య నుంచి బయట పడాలంటే..?  

బయట రావద్దు: అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మాస్క్ ధరించండి: బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఎన్-95 మాస్క్ ధరించాలి. అనవసరమైన కాలుష్య కారకాలను నిరోధించి, కాలుష్య రహిత వాతావరణాన్నిపెంపొందించుకోవాలి.  

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health air-pollution pregnant-women pregnant-women-health delhi-air-pollution delhi-air-quality air-pollution-delhi air-pollution-for-kids toxic-chemicals
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com