Typhus Surge in Los Angeles : టైఫస్' పంజా.. లాస్ ఏంజిల్స్‌లో రికార్డు స్థాయి కేసులు..! ఆస్పత్రుల్లో 90 శాతం మంది..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కరోనా, డెంగ్యూ వంటి మహమ్మారుల నుంచి ఇప్పుడిప్పు డే కోలుకుంటున్న ప్రపంచాన్ని 'టైఫస్' భయం వెంటాడు తోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీలో గజ్జి పురుగులు (Fleas) ద్వారా వ్యాపించే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మునుపెన్నడూ లేని విధంగా విజృంభిస్తోంది. 2025లో ఏకంగా 220 కేసులు నమోదవ్వగా.. ఇది గడిచిన 15 ఏళ్లలో అత్యధికమని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధి బారిన పడిన ప్రతి 10 మందిలో తొమ్మిది మందికి ఆసుపత్రి చికిత్స అవసరమవుతోంది.

ఎలా వ్యాపిస్తుంది అంటే..?

ఈ వ్యాధి సాధారణంగా ఎలుకలు, అడవి పిల్లులు, ఒపోసమ్స్ వంటి జంతువులపై ఉండే చెడు పురుగుల (Fleas) ద్వారా మనుషులకు సోకుతుంది. కలుషిత వ్యర్థాల ద్వారా పురుగుల విసర్జితాలు (Flea dirt) చర్మంపై ఉన్న గాయాల ద్వారా లేదా కళ్లను రుద్దుకున్నప్పుడు రక్తంలోకి ప్రవేశించడం వల్ల వ్యాపిస్తుంది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు. ఈ వ్యాధి సోకిన ఒకటి లేదా రెండు వారాల్లో లక్షణాలు బయటపడతాయి. తీవ్రమైన జ్వరం, చలి. భరించలేనంత తలనొప్పి. కండరాల నొప్పులు, నీరసం.చర్మంపై దద్దుర్లు (Rash).వాంతులు, వికారం. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

 

టైఫస్ ప్రాణాంతకం కాకపోయినా, సకాలంలో గుర్తించకపోతే అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. కుక్కలు, పిల్లులకు ఏడాది పొడవునా 'ఫ్లీ కంట్రోల్' మందులు వాడాలి. వీధి జంతువులకు ఆహారం పెట్టడం, వాటిని తాకడం వంటివి చేయకూడదు. పరిసరాల శుభ్రత, పెరట్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఎలుకలు, ఇతర జంతువులు ఇంట్లోకి రాకుండా రంధ్రాలను మూసివేయాలి.

పెంపుడు జంతువుల ఆహారాన్ని బయట పడేయకూడదు, ఎందుకంటే అది ఎలుకలను ఆకర్షిస్తుంది."ముందస్తు గుర్తింపుతో ఈ వ్యాధిని యాంటీబయాటిక్స్ ద్వారా సులభంగా నయం చేయవచ్చు. జ్వరం, దద్దుర్లు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం" అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.