Sensation : విషపూరిత 'కోల్డ్రిఫ్' సిరప్ కేసులో కంపెనీ యజమాని అరెస్ట్..!

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కలుషితమైన దగ్గు సిరప్ (Cough Syrup) మరణాల కేసులో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు కీలక ముందడుగు వేశారు. తమిళనాడులో 'కోల్డ్రిఫ్' (Coldrif) సిరప్‌ను తయారుచేసిన కంపెనీ యజమానిని అరెస్ట్ చేశారు. కలుషితమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్‌ను తయారు చేసిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ (Sresan Pharmaceuticals) యజమాని జి. రంగనాథన్ (Ranganathan) ను మధ్యప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తమిళనాడులో అరెస్ట్ చేసింది.

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు.

 

చిన్నారుల మరణాలకు కారణమైన రంగనాథన్‌పై నేరపూరిత మానవ హత్య (Culpable Homicide), కల్తీ (Adulteration)డ్రగ్స్ చట్టాల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వాడా (Chhindwara) జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ విషపు సిరప్ సేవించడం వల్ల సుమారు 20 మందికి పైగా చిన్నారులు కిడ్నీ వైఫల్యం (Renal Failure) చెంది ప్రాణాలు కోల్పోయారు.

  ఈ 'కోల్డ్రిఫ్' సిరప్ శాంపిల్స్‌ను పరీక్షించగా, అందులో 48.6 శాతం డైఇథిలీన్ గ్లైకాల్ (Diethylene Glycol) అనే అత్యంత విషపూరితమైన పారిశ్రామిక రసాయనం ఉన్నట్లు తేలింది. ఇది సురక్షిత పరిమితి కంటే 500 రెట్లు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

సుప్రీంకోర్టులో పిటిషన్ (PIL) విచారణ:

చిన్నారుల మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, దేశవ్యాప్తంగా మందుల తయారీ, పరీక్ష, నియంత్రణ వ్యవస్థలో సంస్కరణలు తేవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) స్వీకరించింది. ఈ పిటిషన్‌ను అక్టోబర్ 10న (నేడు) విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

 మధ్యప్రదేశ్, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు వెంటనే ఈ 'కోల్డ్రిఫ్' సిరప్‌పై నిషేధం విధించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ (DGHS) ఆదేశాలు: దగ్గు సిరప్‌ల విక్రయాలు, పంపిణీపై కఠినమైన పరీక్షా ప్రోటోకాల్‌లను అమలు చేయాలని, ముఖ్యంగా 2 సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు మందులు ఇవ్వకూడదని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

 

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : tamil-nadu poison pharmaceutical-companies supreme-court -supreme-court-intervention pharmaceutical-price-regulation-india diethylene-glycol-(deg) toxic-cough-syrup contaminated-cough-syrup cough-syrup-poisoning cough-syrup-crisis pharmaceutical-fraud rednex-pharmaceuticals sresan-pharma-owner-arrested toxic-coldrif-syrup-case g-ranganathan-arrest cough-syrup-deaths-arrest tamil-nadu-pharma-arrest diethylene-glycol-death
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com